Hyderabad: కేంద్ర ప్రభుత్వ తీరు పై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేసారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ నానాటికీ పడిపోతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రూపాయి విలువ అత్యంత కనిష్ఠానికి పడిపోతున్న వేళ, కేంద్ర ఆర్థిక మంత్రి రేషన్ దుకాణాల్లో ప్రధాని మోదీ ఫొటో వెతుకుతూ బిజీగా ఉన్నారన్నారు. రూపాయి విలువ సాధారణంగానే పడిపోయిందని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్ని ఆర్థిక అవరోధాలకు, నిరుద్యోగం, ద్రవోల్బణానికి గాడ్ ఆఫ్ యాక్ట్సే కారణమంటారని చెప్పారు. విశ్వగురును పొగడండి అని ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు.
గురువారం భారత కరెన్సీ రూపాయి భారీగా పతనమైంది. ఒక్క రోజులోనే 83 పైసలు దిగజారి 80.79 వద్ద క్లోజైంది. రూపాయి చారిత్రక కనిష్ఠ స్థాయి ఇదే. అంతేకాదు, ఈ ఏడాది రూపాయి నమోదు చేసిన భారీ పతనాల్లో ఇదొకటి. ఫిబ్రవరి 24వ తేదీన 99 పైసలు నష్టపోయిన తర్వాత రెండో పెద్ద నష్టం ఇది.
While Rupee is at an all time low
Madam FM is busy looking for PM’s photos in PDS shops
She will tell you that the Rupee will find its natural course. All economic hardships, unemployment & inflation are due to Acts of God
Hail Vishwa Guru 🙏 https://t.co/cB6as4bnpv
— KTR (@KTRTRS) September 23, 2022