Site icon Prime9

Ponguleti Srinivas Reddy: పర్మిషన్ రాగానే పట్టేస్తాం.. కేంద్ర మంత్రితో కేటీఆర్‌కు ఏం పని..?

Ponguleti Srinivasa Reddy Sensational Comments: ఫార్ములా ఈ రేసింగ్‌లో జరిగిన అక్రమాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో కేటీఆర్‌ కు ఏం పని? అని ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేసింగ్‌లో అక్రమాలు జరిగాయన్నారు. కేటీఆర్‌ను ప్రశ్నించేందుకు గవర్నర్‌కు ఏసీబీ విజ్ఞప్తి చేసిందన్నారు. గవర్నర్‌ అనుమతి రాగానే ఏసీబీ ప్రశ్నిస్తుందన్నారు. కేసుల మాఫీ కోసమే కేటీఆర్‌ ఢిల్లీ వెళ్లినట్లు మా వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. విదేశాలకు ఏ చట్టం ప్రకారం కేటీఆర్ రూ.55 కోట్లు పంపారని అడిగారు.

నిబంధనలు ఉల్లంఘించారు..
ఈ కార్ రేస్ కోసం కేటీఆర్ నిబంధనలు ఉల్లంఘించారని తెలిపారు. రెండు రోజుల్లో జరిగే పరిణామాలను ముందే ఊహించి ఢిల్లీకి వెళ్లారన్నారు. పదే పదే తనను బాంబుల మంత్రి అంటున్నారు.. ఏం బాంబుకు భయపడి ఢిల్లీకి వెళ్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని కేసీఆర్ మాట్లాడుతున్నారని, మాటలు వింటే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. ఎవరి కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.

Exit mobile version