Site icon Prime9

BR Naidu: కేటీఆర్‌ను క‌లిసిన టీటీడీ చైర్మ‌న్.. తెలంగాణ భక్తుల దర్శనానికి చొరవ చూపాలని కేటీఆర్‌ విజ్ఞప్తి

TTD Chairman BR Naidu Meets BRS Working President KTR: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నందినగర్ నివాసంలో బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాయుడు స్వామివారి తీర్థప్రసాదాలను కేటీఆర్ కు అందజేశారు. నాయుడును కేటీఆర్ శాలువాతో సన్మానించి, వేంకటేశ్వర స్వామి జ్ఞాపికను అందజేశారు. టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినందుకు బీఆర్ నాయుడుకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తిరుమలలో తెలంగాణ భక్తుల దర్శనానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చే లేఖలను పరిగణలోకి తీసుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

కరీంనగర్, సిరిసిల్లలో టీటీడీ దేవాలయాల నిర్మాణాలకు సహకరించాలి..
కరీంనగర్, సిరిసిల్లలో గతంలో శంకుస్థాపన చేసిన టీటీడీ దేవాలయాల నిర్మాణాలు పూర్తయ్యేలా సహకరించాలని కేటీఆర్ కోరారు. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయని వివరించారు. ఆలయాల అభివృద్ధికి టీటీడీ తరఫున తోడ్పాటునందించాలన్నారు. కేటీఆర్ చేసిన విజ్ఞప్తులకు బీఆర్ నాయుడు సానుకూలంగా స్పందించారు. తెలంగాణ భక్తుల దర్శనాలు, ఆలయాల నిర్మాణం, అభివృద్ధి విషయంలో అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామని బీఆర్ నాయుడు హామీనిచ్చారు.

Exit mobile version