CP Anand: పబ్బులపై హైదరాబాదు కమీషనర్ సమీక్ష

ఓ వైపు మైనర్లకు పబ్బుల్లో ప్రవేశాలు, మరో వైపు నిత్యం ఎక్కడో ఓ చోట జరిగే అసాంఘిక వ్యవహారాలకు హైదరాబాదు పబ్ లు కేరాఫ్ గా మారుతున్నాయి. దీనిపై ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అధికారులకు ప్రభుత్వ పెద్దలు అడ్డు తగులుతూ ఉంటారు. దీంతో పర్యవేక్షణ పోలీసులకు సాధ్యం కాని పనిగా మారింది.

Hyderabad: ఓ వైపు మైనర్లకు పబ్బుల్లో ప్రవేశాలు, మరో వైపు నిత్యం ఎక్కడో ఓ చోట జరిగే అసాంఘిక వ్యవహారాలకు హైదరాబాదు పబ్ లు కేరాఫ్ గా మారుతున్నాయి. దీనిపై ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అధికారులకు ప్రభుత్వ పెద్దలు అడ్డు తగులుతూ ఉంటారు. దీంతో పర్యవేక్షణ పోలీసులకు సాధ్యం కాని పనిగా మారింది.

తాజాగా పబ్ లపై సైబరాబాదు సీపి సమీక్ష నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలోని పబ్ ల యాజమాన్యంతో ఆయన భేటీ అయ్యారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని పబ్ నిర్వాహకులకు సూచించారు. పబ్ లో పని చేసేవారితో పాటు వచ్చే వినియోగదారులను పరిశీలించేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శబ్ధ కాలుష్యం, పార్కింగ్ సమస్యలు లేకుండా జాగ్రత్తలు వహించాలని వారితో ఆయన వ్యాఖ్యానించారు. చుట్టుపక్కల నివాసస్ధులకు ఇబ్బంది కలుగకుండా పబ్బులు నిర్వహించుకోవాలని సీపి వారికి సూచించి సమావేశం ముగించారు.

నిబంధనలు తాము ఖచ్ఛితంగా పాటిస్తున్నామని సీపీకి పబ్ నిర్వాహకులు హామీ ఇచ్చారు. అయితే ఆంక్షల అమల్లో కఠినంగా లేకపోవడంతో పబ్ లు కొన్ని సందర్భాలలో యమపాశాలుగా మారుతున్నాయి. ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలోని పబ్ లకు సిసి కెమరాలను అనుసంధానం చేస్తే, అక్రమ వ్యవహరాలకు చెక్ పెట్టే అవకాశాలు ఉంటాయి. దీంతో పాటు నేరం చేయాలనుకొనే వారికి భయం కూడా కలుగుతుంది. ఈ మద్య కాలంలో అత్యాధునిక సాంకేతికత కూడా హైదరాబాదు పోలీసులకు అందుబాటులో వచ్చింది. ఇందుకోసం లక్ష సిసి కెమరాలతో పోలీసులు భాగ్య నగరాన్ని నిత్యం కంటికి రెప్పలా కాపాడుతున్నారు. వినాయక చవితి నిమజ్జనం సమయంలో కూడా ఆధునిక సాంకేతికత పోలీసులకు ఎంతగానో ఉపయోగపడింది. పబ్ ల ఏర్పాట్ల సమయంలో పోలీసు స్టేషన్ల కు సిసి కెమరాలతో అనుసంధానం చేస్తే కొంత నేరాలను కట్టడికి అధిక అవకాశాలు.

ఇది కూడా చదవండి: నాటి ప్రధాని పై ఇన్ఫోసిస్ వ్యవస్ధాపకుడి విమర్శలు