Ahmedabad: ప్రముఖ కంపెనీలకు మోదీ ప్రభుత్వం అండగా ఉందని, అందుకే అదానీ లాంటి వ్యక్తులు ప్రపంచంలోని కీలకమైన ఆర్ధిక వ్యక్తుల్లో ఒకరుగా చలామణి అవుతున్నారని విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్షాలకు ఇన్ఫోసిస్ వ్యవస్ధాపకుడు చెక్ పెట్టారు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు కితాబులిస్తూనే, ఆయన హయాంలో ఆర్ధిక ప్రగతి వెనుకబడిందని విమర్శించారు. అహ్మదాబాద్ లో స్టార్టప్ కంపాస్ పుస్తకం పై చేపట్టిన ఓ కార్యక్రమంలో ఐఐఎం విద్యార్ధులు, పారిశ్రామిక వేత్తలతో జరిగిన సమావేశంలో నారాయణమూర్తి యూపీఏ ప్రభుత్వ హయాంపై ఈ వ్యాఖ్యలు చేశారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో జరిగిన అంతర్జాతీయ సమావేశాల్లో చైనా పేరు నిరంతరం వినిపించేదన్నారు. మన దేశం పేరు వినపడడం అరుదన్నారు. 30 సార్లకు ఒక్కసారి మాత్రమే దేశం పేరు వినిపించేదన్నారు. మాజీ పిఎం సింగ్ మంచి ఆర్ధిక వేత్తేగాని, ఏవో కొన్ని కారణాలతో దేశ ఆర్ధిక ప్రగతి వెనుకబడేలా చేసిందని నారాయణ మూర్తి ఓ రాజకీయ వేత్తగా మాట్లాడారు. ప్రస్తుత మోదీ హయాంలో ప్రపంచ వాణిజ్యంలో ఆశలు చిగురించాయని ఇన్ఫోసిస్ వ్యవస్ధాపకుడు పేర్కొనడం గమనార్హం. నేటి యువత చైనాకు తగిన పోటీగా మార్చగలదని ధీమాను ఆయన వ్యక్తం చేసారు. 1991 మన్మోహన్ సింగ్ హాయంలోని ఆర్ధిక సంస్కరణలు, దివంగత పిఎం వాజ్ పాయ్ ప్రభుత్వంలో ఆర్ధిక రంగాలకు మంచి ఊతమిచ్చాయని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ పై ఆయన విమర్శలు చేశారు.
నారాయణ మూర్తి మాటల్లో రాజకీయ ప్రేరణకు సంబంధించిన అంశాలు స్పష్టం చేస్తున్నాయి. 2004లో 1 బిలియన్ డాలర్ల స్థానం నుండి 2017లో 10 బిలియన్ డాలర్ల విలువతో కంపెనీ ఆర్ధిక పరిస్ధితి తెలియచేస్తుంది. అంతేగాకుండా 2014లో, ఇన్ఫోసిస్ ఎడ్జ్‌వెర్వ్ సిస్టమ్స్ అనే ఉత్పత్తి అనుబంధ సంస్థను కూడా యాజమాన్యం ప్రారంభించింది. వ్యాపార కార్యకలాపాలు, ఖాతాదారుల సేవ, సేకరణ, వాణిజ్య నెట్‌వర్క్ డొమైన్‌ల కోసం ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులపై దృష్టి సారించిడమే ఇన్ఫోసిస్ ప్రధాన ఉద్ధేశం. 2015లో, ఫినాకిల్ గ్లోబల్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ నుండి ఆస్తులు కూడా ఇన్ఫోసిస్ నుండి బదిలీ చేయబడ్డాయి. దీంతో ఎడ్జ్‌వెర్వ్ సిస్టమ్స్ ఉత్పత్తి కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఓ భాగమైంది. తాజాగా ఆయన మాటల పై వాణిజ్య వర్గాల్లో పెద్ద చర్చగా మారింది.