KTR satires: మార్పు రావాలి… కాంగ్రెస్ రావాలంటూ పలికి మొత్తానికి కాంగ్రెస్ వాళ్లు వచ్చారని… అలాగే వారు చెప్పినట్లుగా పెద్ద మార్పే తెచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. జేఎన్టీయూ మెస్ చట్నీలో చిట్టెలుక అనే వార్తా క్లిప్పింగ్‌ను ఆయన జోడిస్తూ… కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ పాలనలో..(KTR Satires)
ఆనాటి కాంగ్రెస్ పాలనలో.. ప్రభుత్వ హాస్టళ్లలో దుస్థితి.. పురుగుల అన్నం.. నీళ్ల చారు.. ఈనాటి కాంగ్రెస్ పాలనలో..ప్రభుత్వ హాస్టళ్లలో ఇంకా అధ్వాన్న పరిస్థితి.. బల్లిపడిన టిఫిన్లు, చిట్టెలుకలు తిరిగే చట్నీలు అంటూ ఎద్దేవా చేశారు. ఇకనైనా కాంగ్రెస్ సర్కారు కళ్లు తెరవాలని లేదంటే భావిభారత పౌరుల నిండు ప్రాణాలకే ప్రమాదమని కేటీఆర్ అన్నారు. వైఫల్యాలను సరిచేయకపోతే ఊహించని విషాదం చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయని హెచ్చరించారు.
“మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి” అన్నారు..
మొత్తానికి.. కాంగ్రెసోళ్లు వచ్చారు.. పెద్ద మార్పే తెచ్చారు.ఆనాటి కాంగ్రెస్ పాలనలో..
ప్రభుత్వ హాస్టళ్లలో దుస్థితి..
పురుగుల అన్నం.. నీళ్ల చారు..ఈనాటి కాంగ్రెస్ పాలనలో..
ప్రభుత్వ హాస్టళ్లలో ఇంకా అధ్వాన్న పరిస్థితి..
బల్లిపడిన… pic.twitter.com/9OjLhJvBgm— KTR (@KTRBRS) July 10, 2024