Transfer of IAS officers in Telangana: తెలంగాణ ప్రభుత్వం సోమవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ (జిహెచ్‌ఎంసి) రోనాల్డ్ రోస్‌తో సహా తెలంగాణలోని పలువురు ఐఎఎస్ అధికారులను బదిలీ చేసింది. గత కొద్ది రోజులకిందట పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేయగా ఆపుడు ఏకంగా 44 మంది అధికారులను బదిలీ చేయడం విశేషం.
జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి..(Transfer of IAS officers in Telangana)
బదిలీ అయిన వారిలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ సుల్తానియాను నియమించగా, పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్, కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా , సంజయ్ కుమార్ నియమితులయ్యారు. యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్, చేనేత, హస్త కళల ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్ , హ్యాండ్లూమ్స్, టీజీసీవో హ్యాండ్‌క్రాఫ్ట్స్ ఎండీగా శైలజలను నియమించారు. అటవీ, పర్యావరణ శాఖలతో పాటుగా టీపీటీఆర్‌ఐ డీజీగా అహ్మద్ నదీమ్ వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ ముఖ్య కార్యదర్శిగా రిజ్వీ, జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. శ్రీదేవసేనను కళాశాల, సాంకేతిక విద్యాశాఖల కమిషనర్‌గా, సర్ఫరాజ్ అహ్మద్ ను హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా, డి.దివ్యను ప్రజావాణి నోడల్ అధికారిగా . ఆమ్రపాలి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా, హరిచందనను రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.