Hyderabad: తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం నుండి ప్రారంభం కానున్న బతుకమ్మ పండుగ సంబరాలకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని ఆరాధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 9రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది.
ఇప్పటికే రూ. 350 కోట్లను ఖర్చు చేసి కోటి మంది ఆడబిడ్డలకు ప్రభుత్వం బతుకమ్మ చీరలను కానుకగా పంచిపెట్టింది. తెలంగాణ సంస్కృతికి, ఆడబిడ్డల గౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగగా సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ శాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండేలే దీవించాలని దేవతగా కీర్తింపబడే బతుకమ్మను సీఎం కేసిఆర్ ప్రార్ధించారు.
ఇది కూడా చదవండి: 30న తిరుమలకు వెళ్లే వాహనాలకు నో ఎంట్రీ