2025 Tata Nano: భలే ఉందిగా.. సామాన్యుడి కలల కారు.. టాటా నానో.. ఈసారి సరికొత్తగా!

2025 Tata Nano: రతన్ టాటా ఆలోచనగా రూపొందించిన టాటా నానో సేల్స్ నిలిచిపోయి చాలా సంవత్సరాలైంది. ప్రస్తుతం ఇదే కారును కొత్త లుక్‌లో విడుదల చేసేందుకు టాటా మోటర్స్ తెరవెనుక సన్నాహాలు చేస్తుందని పలు మీడియా కథనాలు చెబుతున్నాయి. అన్నీ ప్లాన్ ప్రకారం జరిగితే కొత్త టాటా నానో దేశీయ మార్కెట్లో మరోసారి సేల్ వస్తుందని భావిస్తున్నారు. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

రద్దీగా ఉండే సిటీ ట్రాఫిక్‌కు మరింత అనుకూలంగా ఉండేలా టాటా మోటార్స్ సరికొత్త ‘నానో’ కారును డిజైన్ చేయనున్న సంగతి తెలిసిందే. కొత్త టాటా నానో మెరుగైన హెడ్‌లైట్లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది అనేక ఆకర్షణీయమైన కలర్ స్కీమ్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది.

కొత్త టాటా నానో శక్తివంతమైన పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. ఇందులో 30 kmpl మైలేజీని అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 100 కిమీ. ఇది పాత నానో లాగా 4 సీట్ల ఎంపికను పొందవచ్చని భావిస్తున్నారు. ఈ కారు డజన్ల కొద్దీ ఆధునిక లక్షణాలను కలిగి ఉన్నట్లు అంచనా. ముఖ్యంగా ఇందులో హై క్వాలిటీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పవర్ విండోస్, ఎయిర్ కండిషన్, మ్యూజిక్ సిస్టమ్ ఉన్నాయి.

కొత్త టాటా నానో చాలా తక్కువ ధరలో కొనుగోలుకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు 3 లక్షలుగా ఉంది. దీంతో కొత్త కారు కొనాలనుకునే చాలా మంది మధ్యతరగతి ప్రజల కోరిక సులభంగా తీరుతుంది. అయితే కొత్త ‘నానో’ లాంచ్‌కు సంబంధించి కంపెనీ నుండి అధికారిక వివరాలు అందుబాటులో లేవు.

2009లో విడుదలైన ‘నానో’ కారు అమ్మకాలు క్షీణించడంతో 2018లో నిలిపిశారు. ఆ సమయంలో ఈ కారు రూ.2.50 లక్షల నుండి రూ.3.41 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. టాటా నానోలో 624cc పెట్రోల్/CNG ఇంజన్ ఎంపిక ఉంది. ఇది 37.48 PS హార్స్ పవర్,  51 Nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేయగలదు. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను పొందింది. ఇది గతంలో 21.9 నుండి 23.9 kmpl మైలేజీని ఇచ్చేది.

చాలా సంవత్సరాల క్రితం రతన్ టాటా కారులో ప్రయాణిస్తుండగా వర్షంలో దంపతులు, పిల్లలను బైక్‌పై వదిలి వెళ్లారు. ఇది చూసి మధ్యతరగతి వారికి తక్కువ ధరకు కారు తయారు చేసి విక్రయించాలని భావించాడు. కొన్ని సంవత్సరాలలో టాటా నానో విడుదల చేయడం ఇప్పుడు చరిత్ర.