Site icon Prime9

Pushpa 2: అల్లు అర్జున్‌ ‘పుష్ప 2’ వాయిదా? – క్లారిటీ ఇచ్చిన మూవీ టీం

Pushpa 2 Team React on Rumours: అల్లు అర్జున్‌ ‘పుష్ప 2’ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్‌ 5న వరల్డ్‌ వైడ్‌గా 6 భాషల్లో విడుదల కానుంది. దీంతో మూవీ టీం కూడా ప్రమోషన్స్‌ని గట్టిగానే చేస్తుంది. నార్త్‌లో మార్కెట్‌ పెంచుకునేందుకు ట్రైలర్‌ ఈవెంట్‌ను బిహార్‌ పాట్నాలో నిర్వహించారు. అక్కడ ఈ కార్యక్రమానికి వచ్చిన రెస్పాన్స్ చూసి అంతా షాక్‌ అయ్యారు. ట్రైలర్‌ సైతం అత్యధిక వ్యూస్‌తో రికార్డ్స్‌ క్రియేట్‌ చేసింది. దీంతో మూవీపై మరింత హైప్‌ క్రియేట్‌ అయ్యింది. అటూ ఓవర్సిస్‌లోనూ పుష్ప 2 క్రేజ్‌ మామూలుగా లేదు. నెల రోజుల ముందే ప్రీమియర్స్‌ అడ్వాన్స్ బుక్కింగ్స్‌ ఒపెన్‌ అవ్వగా టికెట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. ప్రీ సేల్‌లోనే 1 మిలియన్‌ డాలర్లు మార్క్ దాటేసి సత్తా చాటింది.

ఇక పుష్ప 2 రిలీజ్‌ కి అంతా రంగం సిద్ధమవుతుండగా.. మూవీ వాయిదా అంటూ ఒక్కసారిగా ప్రచారం మొదలైంది. ఇంకా మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ పూర్తి కాలేదంటూ వార్తలు వస్తున్నాయి. మూవీ ఫైనల్‌ వెర్షన్‌ డిసైడ్‌ కాలేదని, ఆ పనిలోనే సుకుమార్‌ బిజీ ఉండటం వల్ల పుష్ప 2 ట్రైలర్‌ ఈవెంట్‌కి రాలేదంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. దీంతో పుష్ప లవర్స్, అభిమానులు డైలామాలో ఉన్నారు. నిజంగా పుష్ప 2 వాయిదా పడుతుందా? అని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై తాజాగా పుష్ప 2 టీం స్పందించింది. డిసెంబర్‌ 5న తగ్గేదే లే అంటూ ట్వీట్‌ చేసి రుమార్స్‌ చెక్‌ పెట్టింది. దీంతో అభిమానులంతా ఊపిరి పిల్చుకుంటున్నారు. డిసెంబర్‌ 5న థియేటర్లో ఇక రప్పారప్పే అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

అల్లు అర్జున్‌ హీరోగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పుష్పకు సీక్వెల్‌ అనే విషయం తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో పుష్ప పార్ట్‌ 1ను 2021 డిసెంబర్‌లో విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఇందులో బన్నీ యాక్టింగ్, డైలాగ్‌ డెలివరికి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. దీంతో ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా భారీ విజయం సాధించింది. దీంతో పార్ట్‌ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చెప్పాలంటే ఏ ఇండియన్‌ సినిమాకు లేని హైప్‌ పుష్ప 2కి కనబడుతుంది. ఈ క్రేజ్‌ చూస్తుంటే రిలీజ్‌ తర్వాత పుష్ప 2 రూ. 1000 కోట్లపైనే గ్రాస్ వసూళ్లు చేయడం పక్కా అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌, జగపతి బాబు, అనసూయ భరద్వాజ్‌, సునీల్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version