Home / ప్రాంతీయం
తెలంగాణలో వచ్చే రెండురోజుల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ తెలిపింది. తూర్పు విదర్భ పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతున్నది. దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.
ఈ నెల 20, 21, 22 తేదీల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తారు20న కుక్కనూరు, వేలేరుపాడు మండలాల్లో 21న కూనవరం, చింతూరు, ఏటపాక, వీఆర్పురం మండలాల్లో 22న పి.గన్నవరం, రాజోలులో చంద్రబాబు పర్యటించనున్నారు. వరద బాధితుల్ని ఆదుకోవడంలో వైసీపీ సర్కారు విఫలమైందని చంద్రబాబు మండిపడ్డారు.
తెలంగాణలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించాక సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కడెం ప్రాజెక్టు వద్ద కనీవినీ ఎరుగని వరదను చూశాం. క్లౌడ్ బరస్ట్ కారణంగానే అలా అకస్మాత్తు వరదలు వస్తాయి.
భీమవరంలో జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న జససేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుని గతంలో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. సొంత పార్టీలో సమస్యలను ప్రస్తావించినందుకు ఎంపీ అని కూడా చూడకుండా పోలీసులతో లాక్కొచ్చి
వైసీపి మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఎవరూ బాగు చేయలేరని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. విధానపరమైన లోపాల గురించి ప్రశ్నిస్తే అసభ్యంగా తిడుతున్నారని, ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చివైసీపి అరాచక పాలనను అంతం చేయాలని పిలుపునిచ్చారు.
ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య సైలెంట్ అయిన రాజకీయాలు మళ్ళీ హీట్ ఎక్కాయా? వరద ప్రాంతాల్లో పర్యటించేందుకు గవర్నర్ తమిళ సై సిద్ధమవగానే, సీఎం కెసిఆర్ పర్యటన ఎందుకు ఖరారు అయింది? ... సీఎం ఏరియల్ సర్వే కు రెడీ అయితే, ఏకంగా గవర్నర్ ఫీల్డ్ విజిట్
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ ఏరియల్ సర్వే చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఏరియల్ సర్వే అనంతరం అధికారులతో సీఎం జగన్ సమీక్ష జరిపారు. గోదావరి వరదలపై ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై మరో వినూత్న డిజిటల్ క్యాంపెయిన్ కు సిద్ధమయ్యారు. నియోజకవర్గాల్లో గ్రామీణ రహదారుల దుస్థితిపై ఒక నిమిషం వీడియో లేక నాలుగు ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలంటూ జనసేనాని పిలుపునిచ్చారు. గుడ్ మార్నింగ్ సీఎం సార్ హష్ టాగ్ తో ఉదయం నుండి సోషల్ మీడియాలో జనసైనికుల పోస్టులు హల్చల్
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. తెలంగాణ, మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులో రికార్డు స్థాయిలో వరద ప్రవాహం నమోదు అవుతోంది. లక్ష్మీ బ్యారేజ్ ఇన్ ఫ్లో 28లక్షల 67వేల 650 క్యూసెక్కులుగా ఉంది. దీంతో లక్ష్మీ బ్యారేజ్ మొత్తం 85 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మరో 5 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వానలు కురుస్తున్నాయని. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో షీర్ జోన్ ఎఫెక్ట్ కొనసాగుతోందని, ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వివరించారు.