Home / ప్రాంతీయం
అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పి.హరిప్రసాద్, సి. రామచంద్రయ్యలు నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలుగా ఉన్న సి. రామచంద్రయ్య, షేక్. మహ్మద్ ఇక్బాల్ వైసీపీకి రాజీనామాచేసి టీడీపీలో చేరారు
తెలంగాణ దీర్ఘకాలిక కరువు సమస్యకు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంతిమ పరిష్కారమని నిరూపించబడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ చేస్తున్న రాజకీయ ప్రచారం మరియు విమర్శలు ఎలా ఉన్నప్పటికీ, ఇలాంటి రాజకీయ కుతంత్రాలను, విమర్శలను బీఆర్ఎస్ తట్టుకోగలదని ఆయన అన్నారు.
ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరులో దారుణం జరిగింది. తన పొలాన్ని కొందరు జేసీబీలు, బుల్డోజర్లతో దున్ని ధ్వంసం చేశారని అధికారులకు మొర పెట్టుకున్నా..పట్టించుకోక పోవడంతో.. ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఎవరైతే నాకేంటి..సీఎం అయినా...పీఎం అయినా ఐ డోంట్ కేర్..లంచం ఇస్తేనే పని అవుతుంది. పచ్చనోట్లు చేతిలో పడితేనే పని. లేకపోతే ఫైల్ పెండింగే..లంచం ఇవ్వండి..మీకు కావాల్సిన ఫైల్స్ పై సంతకాలు పెట్టించుకోండి. నేనింతే..ఎవరేమనకున్నా నా రూటే సెపరేట్ అంటున్నాడు ఓ అధికారి.
ఎల్ అండ్ టి మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ (L&TMRHL) ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీలో ఎక్సలెన్స్ రవాణా (రైల్వే) విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డును పొందింది.ఇటీవల బెంగళూరులో ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్‌పై జరిగిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ 25వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లో మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఒ కెవిబి రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు.
ఏపీలో కొంతమంది టీడీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కాకముందే ఓవర్ యాక్షన్ చేస్తున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయి. తాజాగా సోమవారం రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించి వార్తల్లో కెక్కారు.
తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGSPDCL) యొక్క విద్యుత్ బిల్లులను బ్యాంకులు స్వీకరించడం నిలిపివేసింది. దీనితో రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులు సోమవారం నుండి PhonePe, Google Pay, Paytm, Amazon Pay వంటి థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా బిల్లులు చెల్లించలేరు.
ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఊరేగింపులు జరుపుకోవడం తనకు ఇష్టం ఉండదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు పింఛన్లు ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికే నియోజకవర్గానికి వచ్చానన్నారు.
విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై దర్యాప్తునకు ఏర్పాటైన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు సోమవారం కొట్టివేసింది.
ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పింఛన్ల పంపిణీని ఇవాళ ప్రారంభించారు.