Home / ప్రాంతీయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నాడు తాజాగా ప్రారంభమయ్యాయి. ఏపీ రాష్ట్ర గవర్నర్ గా అబ్దుల్ నజీర్ ఇటీవలనే బాధ్యతలు స్వీకరించారు. సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన అబ్దుల్ నజీర్ ఇటీవలనే రిటైర్ అయ్యారు. సుప్రీంకోర్టు జడ్జిగా రిటైరైన వెంటనే ఏపీ గవర్నర్ గా నజీర్ ను నియమిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు హాజరు కాకుండా మినహాయింపు కోసం అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించారు. అయితే, అవినాష్ రెడ్డికి మినహాయింపు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.
సర్వర్ డౌన్ సమస్య ఏపీ సచివాలయానికి తాకింది. శాసనసభ ప్రాంగణాల్లో ఇంటర్నెట్ సేవల్లో తీవ్ర సమస్య తలెత్తింది.
ప్రశ్నించడం కోసమే అంటూ ప్రజల పక్షాన నిలబడి వారికి అండగా ఉంటున్నారు పవన్ కళ్యాణ్. సినిమా రంగంలో టాప్ స్టార్ హీరోగా ఉండి.. కోట్లలో రెమ్యునరేషన్స్ తీసుకుంటూ.. లెక్కలేనంత అభిమాన సముద్రాన్ని సంపాదించుకున్న నిరంతర కృషీవలుడు పవన్ కళ్యాణ్. వాటన్నింటినీ వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి ప్రజల పక్షాన ఉంటూ వారి కోసం నిలబడ్డారు ఈ జనసేనాని.
పవన్ కళ్యాణ్ సారధ్యంలోని జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నేడు నిర్వహించనున్నారు. "దిగ్విజయ భేరి" పేరుతో జరగనున్న ఈ సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. బందరు శివర్లో 35 ఎకరాల్లో సభ ప్రాంగణం ఏర్పాట్లు చేశారు. సభ వేదికకు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పుణ్య వేదికగా నామకరణం చేశారు.
పవన్ కళ్యాణ్ సారధ్యం లోని జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నేడు నిర్వహించనున్నారు. బందరు నగర శివారులో జరగనున్న ఈ వేడుక కోసం జనసేన నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం జరిగే సభా వేదిక వద్దకు మొదటి సారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన వారాహి వాహనంలో చేరుకోనున్నారు.
మాజీ మంత్రి కె. విజయరామారావు కన్నుమూసారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంగా ఉన్న విజయరామారావు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన చంద్రబాబు నాయుడు హయాంలో మంత్రిగా పనిచేసారు.
ఏపీలో జనసేన చేపట్టిన కార్యక్రమాలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అడుగడునా అడ్డుపడుతోంది. మచిలీపట్నంలో జనసేన 10వ ఆవిర్భావ సభకు పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ ఉద్యోగుల ఆందోళన గురించి తెలుసని వెల్లడించింది. ఉద్యోగ సంఘాలతో ప్లాంట్ యాజమాన్యం చర్చిస్తోందని కేంద్రం తెలిపింది.
ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి , మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నిర్వహించిన పోలింగ్ ముగిసింది.