Home / ప్రాంతీయం
తెలంగాణలో ఎన్నికల సమరంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు.. అధికారం కోసం సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వరుస మీటింగ్ లతో ప్రజలతో మమేకం అవుతున్నారు. అందులో భాగంగా మంగళవారం మధిర నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మత్స్యకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఆ ప్రెస్ నోట్ లో.. కడలినీ, కాయ కష్టాన్నీ నమ్ముకొని ఆటుపోట్లతో జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు.
తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న “యువగళం” పాదయాత్ర గురించి తెలిసిందే. 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్ల మేర సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు అరెస్ట్ కావడంతో పదయాత్రకు బ్రేక్ పడింది. కాగా తాజాగా ఏపీ హైకోర్టు రెగ్యులర్
: విశాఖ షిప్పింగ్ హార్బర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన మత్స్యకారులకు ఆర్దిక సాయం చేయాలని జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. 60కి పైగా బో ట్ల దగ్ధం జరిగి నష్టపోయిన బోట్ల యజమానులకు ఒక్కొక్కరికి ఏభై వేల రూపాయలు ఆర్దిక సాయం చేస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో పరిస్థితులన్నీ వాడి వేడిగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల వరుసగా కాంగ్రెస్ నేతల ఇల్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా కక్షపూరితంగానే ఇలా కాంగ్రెస్ నేతలపై దాడులు చేస్తున్నారని మండిపడుతున్నారు.
తెలంగాణ ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైందని తెలిసింది. 22న వరంగల్, సూర్యాపేట, 23న తాండూర్, 24న కూకట్ పల్లి, 25న ఎల్బి నగర్, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్‌లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు.
హైదరాబాద్ లో జరిగే ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వేడుకల్లో "సదర్" కూడా ఒకటి. ఈ పండుగను దీపావళి ఉత్సవాల్లో భాగంగా పండుగ ముగిసిన రెండో రోజున నిర్వహిస్తారు. అలంకరించిన దున్నపోతులతో యువకులు కుస్తీ పట్టడం ఆనవాయితీగా వస్తుంది. దున్నపోతుల ఉత్సవంగా కూడా వ్యవహరించే పండుగను పురస్కరించుకొని వివిధ
తెలంగాణ అసెంబ్లీ బరిలో నిలుచున్న అభ్యర్దులందరిలో అత్యంత ధనవంతుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డని వార్తలు వచ్చాయి. అయితే నామినేషన్ల ఘట్టం ముగిసేనాటికి అత్యంత ధనవంతుడిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన గడ్డం వివేకానంద నిలిచారు
తెలంగాణలో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇక నామినేషన్ల ఘట్టం ముగియడంతో ఇవాళ నామినేషన్ల పరిశీలన అంకం మొదలైంది. ఈ నెల 15వ తేదీలోపు నామినేషన్ల ఉపసంహరణకు ఈసీ గడువు విధించింది. పోటీ నుంచి తప్పుకోవాలనుకున్నవారు 15లోపు ఉపసంహరించుకోవాలని సూచించింది.
ఖమ్మం నియోజకవర్గంలో ప్రత్యర్థులుగా తలపడుతున్న మంత్రి పువ్వాడ అజయ్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రత్యర్థిని ఇరుకున పెట్టే ఏ చిన్న అవకాశాన్నీ ఇద్దరూ వదులుకోవడం లేదు. తాజాగా మంత్రి పువ్వాడ అజయ్‌పై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.