Last Updated:

Pawan Kalyan: నాకు హెల్త్ ఇన్స్యూరెన్స్ లేదు.. నేను ఆలోచించేది వారి గురించే.. కాకినాడలో భావోద్వేగానికి గురైన జనసేనాని పవన్ కళ్యాణ్

Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు చేపట్టిన వారాహి విజయయాత్ర ఉభయగోదావరి జిల్లాల్లో కొనసాగుతోంది. మూడో రోజు శనివారం కాకినాడలో విజయంవతంగా కొనసాగింది. జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయిపోయారు.

Pawan Kalyan: నాకు హెల్త్ ఇన్స్యూరెన్స్ లేదు.. నేను ఆలోచించేది వారి గురించే.. కాకినాడలో భావోద్వేగానికి గురైన జనసేనాని పవన్ కళ్యాణ్

Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు చేపట్టిన వారాహి విజయయాత్ర ఉభయగోదావరి జిల్లాల్లో కొనసాగుతోంది. మూడో రోజు శనివారం కాకినాడలో విజయంవతంగా కొనసాగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఉదయం స్ధానికంగా ఉన్న నగర ప్రముఖులతో పాటు మేథావులతోనూ భేటీ అయ్యారు. వారితో అక్కడి తాజా పరిస్ధితులపై చర్చించారు. అనంతరం జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొదటగా దురదృష్టవశాత్తు వేర్వేరు ప్రమాదాల్లో మృతిచెందిన జనసేన క్రియాశీలక సభ్యులకు పవన్ నివాళులర్పించారు. అనంతరం ప్రారంభమైన జనవాణి- జనసేన భరోసా కార్యక్రమానికి తమ సమస్యలు చెప్పుకునేందుకు వేలాది సంఖ్యలో ప్రజలు జనవాణికి విచ్చేశారు. జనసేనానికి తమ గోడు వెళ్లుబోసుకున్నారు. ఈ సందర్భంగా ఓ దివ్యాంగుడి పరిస్థితి గురించి తెలుసుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు పవన్ కళ్యాణ్. తమకు పెన్షన్ అందడం లేదని, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని ఓ దివ్యాంగుడు, మహిళ జనసేన అధినేతకు చెప్పుకొంటూ కన్నీరు పెట్టగా భయమేమి లేదు మీకు నేను అండగా ఉంటానంటూ అభయమిచ్చారు పవన్ కళ్యాణ్. ఇదే తరుణంలో పవన్ కళ్యాణ్ ను చూసేందుకు కూడా భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.

ఆదుకోవడానికి అండగా ఉంటా(Pawan Kalyan)

ప్రాణం విలువకట్టలేదని కానీ కాస్త భరోసా ఇచ్చేందుకు మాత్రమే తమ పార్టీ వారి కుటుంబాలకు తనకు తోచిన సాయం అందిస్తున్నాని ఆయన అన్నారు. అంతేకాకుండా పార్టీ పెట్టినప్పుడు 50 వేల మంది సభ్యులుంటే చాలు గొప్ప అనుకుంటే.. ఇప్పుడు 6 లక్షల76వేల క్రియాశీల సభ్యులు స్వచ్చందంగా జనసేనలోకి వచ్చారని ఇది ఎంతో గౌరవప్రదమని వారిని రక్షించడం వారికి అండగా ఉండడం తన బాధ్యతని ఆయన వివరించారు. ప్రాణాలు కోల్పోయిన జనసైనికుల ఆశయాలను వారి కుటుంబ సభ్యులు ముందుకు తీసుకెళ్లాలని ఆయన అన్నారు. కోటి మందిని ఆదుకోలేకపోవచ్చు కానీ కోటి మందిని ప్రభావితం చేయగలిగే సత్తా నాదగ్గర ఉంది అంటూ పవన్ చెప్పుకొచ్చారు. నాకు హెల్త్ ఇన్స్యూరెన్స్ లేదు.. నా గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు.. కానీ సామాన్య సగటు మనిషి గురించి మాత్రమే ఆలోచించా సామాన్యులకు అండగా ఉంటా అని చెప్పారు.

వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై, ప్రజా సమస్యలపై గళం విప్పుతానని కాకినాడ సాక్షిగా ప్రజలకు భరోసా ఇచ్చారు. ఫించన్ కోల్పోయిన దివ్యాంగుడికి వీల్ చైర్ కొనివ్వడంతో పాటు ఆర్ధికంగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అక్కడికి తమ గోడు వెళ్లుబుచ్చుకోవడానికి వచ్చి పలువురు ప్రజల సమస్యలను ఆయన స్వయంగా విని వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని అభయం ఇచ్చారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జనసేన ప్రభుత్వం ఏర్పాటు, అధికారం చేపట్టాక తన అజెండా ఎలా ఉంటుందన్న దానిపై ప్రజలకు వివరణ ఇచ్చారు. జనసేన అజెండాలో ముఖ్యంగా పవన్ నాలుగు అంశాల్ని ప్రస్తావించారు. వీటి ఆధారంగానే తన పాలన ఉంటుందంటూ ప్రజలకు పవన్ స్పష్టం చేశారు.

జనసేన పాలనలో స్వచ్ఛత, బాధ్యత, పారదర్శకత, సుపరిపాలన అనే నాలుగు అంశాలనే ప్రాధాన్యంగా తీసుకుని ముందుకు వెళ్తామని జనసేనాని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ముఖ్యంగా తన పాలనలో జవాబుదారీతనానికి పెద్ద పీట వేస్తామని పేర్కొన్నారు. ప్రజా పద్దులోని ప్రతి రూపాయికి కచ్చితంగా ప్రజలకు లెక్క చూపించేలా బాధ్యత తీసుకుంటామని చెప్పుకొచ్చారు. సహజ వనరుల దోపిడీని పూర్తిగా అరికట్టేలా చర్యలు తీసుకుంటామని.. సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు అభివృద్ధి పనుల ప్రణాళికతో ముందుకు వెళ్తామని తనను సీఎం చేయండి అంటూ పవన్ కళ్యాణ్ విన్నవించారు.