Visakha Bus Shelter : విశాఖలో 40 లక్షలతో బస్ షెల్టర్ నిర్మాణం.. నాలుగు రోజులకే కుప్పకూలిన వైనం

విశాఖపట్నంలో రూ.40 లక్షలతో కొత్తగా నిర్మించిన బస్ షెల్టర్.. పట్టుమని నాలుగు రోజులు కూడా ఉండకుండా కుప్పకూలడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఆ సమయంలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకుంటున్నారు. జీవీఎంసీ మేయర్ గొలగాని వెంకట కుమారి ప్రారంభించిన

  • Written By:
  • Publish Date - August 27, 2023 / 05:32 PM IST

Visakha Bus Shelter : విశాఖపట్నంలో రూ.40 లక్షలతో కొత్తగా నిర్మించిన బస్ షెల్టర్.. పట్టుమని నాలుగు రోజులు కూడా ఉండకుండా కుప్పకూలడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఆ సమయంలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకుంటున్నారు. జీవీఎంసీ మేయర్ గొలగాని వెంకట కుమారి ప్రారంభించిన ఈ బస్ బే.. పట్టుమని నాలుగు రోజులు కూడా ఉండకుండా కుంగిపోవడంపై విశాఖ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మోడ్రన్ బస్ షెల్టర్ పేరుతో రూ.40 లక్షలు వెచ్చించి కట్టిన నిర్మాణం నాలుగు రోజులు కూడా నిలవలేదని మండిపడుతున్నారు. లక్షలు ఖర్చు చేసి నిర్మించిన బస్ షెల్టర్ల నిర్మాణ పనుల్లో భారీగా అవినీతి జరిగిందని సీపీఎం, జనసేన కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆందోళన కూడా చేపట్టారు. స్థానిక జీవీఎంసీ కార్యాలయం ముందు కట్టిన బస్ షెల్టర్ పరిస్థితే ఇలా ఉంటే మిగతా చోట్ల కట్టిన వాటి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడడమేనని ఫైర్ అవుతున్నారు. బస్ షెల్టర్ నిర్మాణంలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం, జనసేన కార్పొరేటర్లు డిమాండ్ చేశారు.