Site icon Prime9

Nara Rohit: హీరో నారా రోహిత్‌ ఇంట తీవ్ర విషాదం – ఆయన తండ్రి కన్నుమూత

Chandrababu Naidu Brother Died: హీరో నారా రోహిత్‌ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి నారా రామ్ముర్తి నాయుడు కన్నుమూశారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు అనే విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో నేడు (నవంబర్‌ 16)న ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. ఇప్పటికే సీఎ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లు హైదరాబాద్‌కు బయలుదేరారు. తమ్ముడి ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉండటంతో నేడు వెళ్లాల్సిన మహారాష్ట్ర పర్యటనను చంద్రబాబు పర్యటన రద్దు చేసుకున్నారు.

ఇక లోకేష్‌ కూడా అసెంబ్లీ సమావేశాలతో పాటు ఇతర కార్యకలాపాలను రద్దు చేసుకుని హైదరాబాద్‌ బయల్తేరారు. తండ్రి మరణంతో హీరో నారా రోహిత్‌, అతడి కుటుంబం విషాదంలోకి వెళ్లింది. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు హీరో రోహిత్‌, చంద్రబాబుకు సంతాపం తెలుపుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ నివాళులు తెలుపుతున్నారు. కాగా నారా రోహిత్‌ ప్రతినిథి 2 హీరోయిన్‌ సిరిలెల్లాను నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతలోనే ఆయన తండ్రి మరణించడంతో ఆయన కుటుంబం తీవ్ర దిగ్బ్రాంతిలోకి వెళ్లింది.

Exit mobile version