Bandi Sanjay: కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అటకెక్కాయి.. బండి సంజయ్ ఫైర్
Telangana: కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అటకెక్కించిందని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలను అడిగినప్పుడల్లా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్ల కోసం కేంద్రం నిధులు ఇచ్చిందని, అభివృద్ధి పనుల కోసం తెలంగాణ రాష్ట్రానికి రెండు లక్షల కోట్లు విడుదల చేసిందన్నారు. వరి, ఇతర పంటలకి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇస్తోందని తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరం, ఫార్ములా కేసు, డ్రగ్స్ కేసులు పత్తా లేకుండా పోయాయని మండిపడ్డారు. మూటలు తీసుకెళ్లి ఢిల్లీలో పార్టీకి కప్పం కడుతున్నారని ఆరోపించారు. రాజన్న కోడెల మరణాల విషయంపై మాట్లాడారు. కోడెలని రక్షించాల్సిన బాధ్యత రాజన్న దేవస్థానం సిబ్బందేనని, వాటిని రక్షించేందుకు సరైన ప్రణాళికలు రూపొందించాలని, కోడెలు ఉంటే గదుల సంఖ్య పెంచాలని సూచించారు. మరోవైపు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు భారత సైనికులని కించపరిచే విధంగా ఉన్నాయని ఫైర్ అయ్యారు. ఆర్మీ చీప్ మీద మీకు విశ్వాసం లేదా అని ప్రశ్నించారు. పహల్గామ్ సంఘటన జరిగిన 15 రోజుల్లోనే ఉగ్రవాదులను కేంద్రం అంతం చేసిందని, ఉగ్రవాదం అంతం అయ్యే వరకు యుద్ధ కొనసాగుతుందన్నారు. పీవోకేని కాంగ్రెస్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదని నిలదీశారు.