Last Updated:

Jayalalitha Leaked Audio: కలకలం రేపుతున్న దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆడియో

దేశంలో సంచలనం సృష్టించిన తమిళనాడు ముఖ్యమంత్రి, పురచ్చితలైవి జయలలిత మరణ సమయంలో అపోలో హాస్పిటల్ నందు చోటుచేసుకొన్న ఓ ఆడియో నెట్టింట కలకలం రేపుతుంది.

Jayalalitha Leaked Audio: కలకలం రేపుతున్న దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆడియో

Tamil Nadu: దేశంలో సంచలనం సృష్టించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, పురచ్చితలైవి జయలలిత మరణ సమయంలో అపోలో హాస్పిటల్ నందు చోటుచేసుకొన్న ఓ ఆడియో నెట్టింట కలకలం రేపుతుంది. వైరల్ గా మారిన ఆ ఆడియోలో ఆసుపత్రి డాక్టర్ల పై జయలలిత అసహనం వ్యక్తం చేసిన్నట్లు, పిలిచిన్నప్పుడు ఎందుకు రావడం లేదని ఆమె కోపగించుకొన్నట్లుగా ఆడియోలో రికార్డు అయివుంది. తాను మంచపైన బాధపడుతుంటే ఎవ్వరూ పట్టించుకోవడం లేదని జయలలిత డాక్టర్లను ప్రశ్నించిన్నట్లుగా ఆ ఆడియోలో ఉండడం గమనార్హం. ఆనాటి ఆడియో నేడు బయట రావడంతో నాటి అధికార పెద్దలకు తలకు చుట్టుకొనే ప్రయత్నంలోనే ఇదంతా సాగుతుందని ప్రజలు భావిస్తున్నారు.

మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి పై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి నేతృత్వంలోని విచారణ కమిషన్ పలు అనుమానాలు వ్యక్తం చేసింది. జయలలిత నెచ్చిలి శశికళ సహా మొత్తం ఏడుగురి తీరును కమిషన్ తప్పుబట్టింది. ఘటన పై విచారణ చేయించాలని ప్రభుత్వానికి జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ సిఫారసు చేసింది. ప్రభుత్వానికి కొన్ని విషయాలను కమిటి పొందుపరిచింది.

శశికళను తన ఇంటి నుంచి గెంటేసిన జయ, 2012లో మళ్లీ దరి చేర్చుకున్నారు. అయినా వారిద్దరి మధ్య సరైన సఖ్యత లేదు. ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్య బృందం ఐదుసార్లు చెన్నైలోని అపోలో ఆసుపత్రికి వచ్చినా జయకు అందించే చికిత్స పై ఎలాంటి సిఫారసు చేయలేదెందుకు? ఈ వ్యవహారంలో శశికళను నిందితురాలిగా పేర్కొనడం తప్ప ఎలాంటి నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదు.

అమెరికా నుంచి వచ్చిన వైద్యులు డా.సమీర్‌ శర్మ జయకు గుండె శస్త్రచికిత్స చేయాలని సిఫారసు చేశారు కానీ, అది జరగలేదు. జయకు చికిత్స అందించేందుకు వచ్చిన ప్రపంచ ప్రసిద్ధ హృద్రోగ నిపుణుడు రిచర్డ్‌ పీలే యాంజియో చేయాలని సిఫారసు చేసినా అది అమలు కాలేదు. శశికళ-జయ మధ్య సఖ్యత లేకపోవడంతో లాభం కోసమే శశికళ చికిత్సలను అడ్డుకొనిందని కమిటి భావిస్తుంది.

2016 డిసెంబరు 5వ తేది రాత్రి 11.30 గంటలకు జయ మృతిచెందారని అపోలో ఆస్పత్రి ప్రకటించింది. కానీ జయ 2016 డిసెంబరు 4వ తేది సాయంత్రం 3 నుంచి 3.30 గంటల మధ్య చనిపోయివుండవచ్చని సాక్షుల వద్ద విచారణలో తేలింది. జయ చికిత్స పై వాస్తవాలు తెలియాలంటే విచారణ కమిషన్‌ అవసరం. ఆస్పత్రిలో చేర్పించడానికి మూడు రోజుల ముందు నుంచే జయ జ్వరంతో బాధపడ్డారు. శశికళ బంధువు డాక్టర్‌ శివకుమార్‌ సిఫారసుతో ఆమె పారాసిటమల్ మాత్ర వేసుకున్నారు.

2016 సెప్టెంబరు 22న రాత్రి తన ఇంట్లో మొదటి అంతస్తులోని బాత్రూమ్‌ నుంచి పడక గదిలోకి వచ్చే సమయంలో జయ స్పృహ తప్పారు. ఆమెను శశికళ తీసుకెళ్లారు. జయను సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లినా, అంతకు ముందు జరిగిన విషయాలను శశికళ గోప్యంగా ఉంచారు. జయ అనారోగ్యానికి గురికావడం, ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత జరిగిన సంఘటనలన్నింటినీ శశికళ రహస్యంగా ఉంచారు. జయ చికిత్స కోసం తీసుకొచ్చిన ఆస్పత్రిలో సీసీ కెమెరాలు తొలగించడం నుంచి ఆమె మరణం వరకు అన్ని విషయాలను శశికళ రహస్యంగా ఉంచారు. ఆసుపత్రిలోని పది గదులను శశికళ బంధువులు ఆక్రమించారు.

జయ ఆరోగ్య పరిస్థితి పై ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన ప్రకటనలో ఒకటి అసత్యం. జయను ఏ సమయంలోనైనా డిశ్చార్జ్‌ చేస్తాం అనే ప్రకటన పూర్తిగా అవాస్తమైనది. 2016 సెప్టెంబరు 22 రాత్రి జయ తీవ్ర అస్వస్థతకు గుయ్యారు. అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో వున్నప్పుడు జ్యూస్‌ తాగారు. ఇడ్లీ తిన్నారు. వాకింగ్‌ చేశారు. టీవీ చూశారంటూ వార్లలు గుప్పుమన్నాయి. కానీ జయను ప్రత్యక్షంగా చూసినవారెవ్వరూ లేరు. అందరూ ఆసుపత్రి బయటే పడిగాపులు కాశారు.

నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామమోహన్‌రావు ప్రభుత్వ అనుమతి లేకుండా 21 ఫైళ్ల పై సంతకాలు చేశారు. పాలనాపరమైన కీలకపదవిలో ఉన్న వ్యక్తి  చేసిన పెద్ద తప్పుగా కమిషన్‌ భావిస్తోంది. నాటి ముఖ్యమంత్రి ప్రాణానికి సంబంధించిన వ్యవహారం గనుక దాని ఫలితాన్ని ఆయన పొంది తీరాల్సిందే. అందువల్ల అతడిని ఖచ్చితంగా విచారణ జరపాలని సిఫార్సు చేస్తున్నాం. అంతేగాక నాటి ఆరోగ్యమంత్రి విజయభాస్కర్‌, కార్యదర్శి రాధాకృష్ణన్‌, అప్పటి సీఎస్‌, శశికళ, కేఎస్‌ శివకుమార్‌ తదితరులను విచారణ జరపాలి. అపోలో ఆసుపత్రి చైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సి.రెడ్డి వద్ద విచారణ జరపడం పై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని కమిటి తన విచారణ చేసిన విషయాలను నేటి ప్రభుత్వానికి అందచేసింది.

ఇది కూడా చదవండి: Shock for AP government: ఏపీ ప్రభుత్వానికి షాక్..వివేకా హత్యకేసు వేరే రాష్ట్రం బదిలీకి సుప్రీం కోర్టు ఓకే

ఇవి కూడా చదవండి: