Last Updated:

Devara Movie : ఎన్టీఆర్ “దేవర” మూవీ నుంచి సైఫ్ అలీ ఖాన్ కి బర్త్ డే గిఫ్ట్.. “భైర” పోస్టర్ రిలీజ్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి వారసుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు " యంగ్ టైగర్ ఎన్టీఆర్". ఇక రీసెంట్ గా వచ్చిన “ఆర్ఆర్ఆర్” సినిమాతో గ్లోబల్ లెవెల్ కి చేరింది. ఈ సినిమా లోని నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు రావడంతో ఎన్టీఆర్ క్రేజ్ అంతర్జాతీయ స్థాయిలో భారీగా పెరిగిందని చెప్పాలి.

Devara Movie : ఎన్టీఆర్ “దేవర” మూవీ నుంచి సైఫ్ అలీ ఖాన్ కి బర్త్ డే గిఫ్ట్.. “భైర” పోస్టర్ రిలీజ్

Devara Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి వారసుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు ” యంగ్ టైగర్ ఎన్టీఆర్”. ఇక రీసెంట్ గా వచ్చిన “ఆర్ఆర్ఆర్” సినిమాతో గ్లోబల్ లెవెల్ కి చేరింది. ఈ సినిమా లోని నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు రావడంతో ఎన్టీఆర్ క్రేజ్ అంతర్జాతీయ స్థాయిలో భారీగా పెరిగిందని చెప్పాలి. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా “దేవ‌ర‌”. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ ఆంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ న‌టి జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు షైన్ టామ్‌ చాకో విలన్స్ గా కనిపించనున్నారు.

ఈ సినిమాలో మరో ప్రత్యేక విషయం ఏంటి అంటే.. నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాణంలో రాబోతుండడం. అలానే ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా ఫుల్ మాస్ యాక్షన్ గా ఉంటుందని ఇప్పటికే కొరటాల శివ చెప్పారు. ఈ మేరకు ఇటీవల టైటిల్ తో పాటు రిలీజ్ చేసిన తారక్ లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ రాబోతుందని మొదటి నుంచి చెప్పున్న మాటలకు ఈ పోస్టర్ మరింత ఊపు ఇచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది.

నేడు సైఫ్ అలీ ఖాన్ పుట్టిన రోజు సందర్భంగా దేవర సినిమా నుంచి సైఫ్ అలీ ఖాన్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సైఫ్ క్యారెక్టర్ పేరు భైరా అని ప్రకటించారు. సముద్రం, అలలు మధ్య భైరాని చూపించారు. లాంగ్ హేయవర్ తో సైఫ్ ఊర మాస్ గా అనిపిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ -సైఫ్ మధ్య యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అని సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు. ఇక ఇప్పటికే చిత్ర యూనిట్ ఈ మూవీకి సంబంధించిన రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేయగా.. తాజాగా మూడో షెడ్యూల్ కి రెడీ అవుతున్నారని సంచారం అందుతుంది. హైదరాబాద్ లోని ఒక ప్రత్యేక సెట్ లో ఈ షెడ్యూల్ త్వరలోనే మొదలు కానుంది. సుమారు 10 రోజులు పాటు ఈ షెడ్యూల్ జరగనుంది అని టాక్ నడుస్తుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.