Jr NTR Tribute to NTR: ఎన్టీఆర్ జయంతి.. జూ. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, పలువురు నివాళులు!
Jr NTR and Kalyan Ram Tribute to Senior NTR: విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ సీఎం నందమూరు తారకరామారావు 102వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, సినీ అభిమానులు ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి తాతయ్యకు పుష్పాంజలి ఘటించారు. ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్ ఘాట్ కు తరలివస్తున్న క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాగా ప్రముఖులతో పాటు కార్యకర్తలు, అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శిస్తున్నారు. తమ అభిమాన నేత సమాధిని దర్శించుకుని.. రాజకీయాలు, సినిమాల్లో ఆయన రాణించిన విధానాన్ని గుర్తుచేసుకుంటున్నారు. మరోవైపు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 28న ఎన్టీఆర్ జయంతిని అధికారికంగా నిర్వహించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
అటు రాజకీయాల్లోనే కాకుండా, సినిమా రంగంలోనూ ఎన్టీఆర్ తిరుగులేని నటుడిగా నిలిచారు. సినిమా రంగంలో తనకంటూ ఓ మార్క్.. కాదు.. కాదు.. సినిమా రంగానికే ఆయన ఓ దిక్సూచిలా మారారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఎన్నో పౌరాణిక, కుటుంబ కథా, జనపద కథా చిత్రాలు తీసి అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. క్యారెక్టర్ ఏదైనా.. ఎన్టీఆర్ అయితేనే దానికి కరెక్ట్ అనేలా ఆయన అభినయం ఉండేది.