Mohan Babu: ఆస్పత్రిలో జర్నలిస్ట్ రంజిత్‌ని పరామర్శించిన మోహన్ బాబు – మీడియాకు బహిరంగ క్షమాపణలు
Mohan Babu Visists Yashoda Hospital: సినీ నటుడు మోహన్ బాబు బహిరంగ క్షమాపణలు చెప్పాడు. ఇటీవల తన ఇంటిలో జరిగిన వివాదాల నేపథ్యంలో జర్నలిస్ట్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో మోహన్ బాబు తీరుపై జర్నలిస్ట్ సంఘాలు మండపడ్డాయి. గాయపడిన మీడియా ప్రతినిథికి ఆయన క్షమాపణలు చెప్పాలంటూ భారీ ఎత్తున నిరసనలు చెపట్టారు. ఈ ఘటనలో ఆయనపై హత్యాయత్నం కేసు కూడా నమోదైంది.
ఈ క్రమంలో ఇటీవల ట్విటర్ వేదికగా క్షమాపణలు కోరిన ఆయన ఇప్పుడు నేరుగా సదరు జర్నలిస్ట్‌ను క్షమాపణలు కోరారు. మోహన్ బాబు దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిని జర్నలిస్ట్ రంజిత్ ప్రస్తుతం యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో మోహన్ బాబు తన కుమారుడు మంచు విష్ణుతో కలిసి యశోద ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ జర్నలిస్ట్ రంజిత్‌ని కలిసి పరామర్శించారు.
అనంతరం తను ఉద్దేశపూర్వంగా చేయలేదని, ఒత్తిడిలో అనుకోకుండ జరిగిందని వివరణ ఇచ్చారు. అనంతరం అతడికి క్షమాపణలు చెప్పారు. అలాగే మీడియాను కూడా బహిరంగంగా క్షమాపణలు కోరారు. ఆ తర్వాత జర్నలిస్ట్ రంజిత్ కుటుంబాన్ని పరమర్శించి.. ఆయన కుటుంబసభ్యులకు సారీ చెప్పారు. మెహన్ బాబుతో పాటు మంచు విష్ణు కూడా జర్నలిస్ట్ రంజిత్‌ను కలిసి పరమర్శించాడు. కాగా.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.