Last Updated:

Kollywood : కోలీవుడ్ లో షాకింగ్ ఘటన.. విశాల్, శింబు కి రెడ్ కార్డ్.. మరో ముగ్గురికి కూడా !

కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో తాజాగా ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తమిళ స్టార్ హీరోలు అయిన శింబు, విశాల్ కి రెడ్ కార్డ్ ఇష్యూ చేశారు. వీరితో పాటు ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్ జే సూర్య, కమెడియన్ యోగి బాబు, యంగ్ హీరో అధర్వలపై కోలీవుడ్ నిర్మాతల మండలి రెడ్ కార్డుని ఇష్యూ చేసింది. నిర్మాణ సంస్థలకు సమయానికి స్పందించకపోవడం

Kollywood : కోలీవుడ్ లో షాకింగ్ ఘటన.. విశాల్, శింబు కి రెడ్ కార్డ్.. మరో ముగ్గురికి కూడా !

Kollywood : కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో తాజాగా ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తమిళ స్టార్ హీరోలు అయిన శింబు, విశాల్ కి రెడ్ కార్డ్ ఇష్యూ చేశారు. వీరితో పాటు ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్ జే సూర్య, కమెడియన్ యోగి బాబు, యంగ్ హీరో అధర్వలపై కోలీవుడ్ నిర్మాతల మండలి రెడ్ కార్డుని ఇష్యూ చేసింది. నిర్మాణ సంస్థలకు సమయానికి స్పందించకపోవడం, అడ్వాన్స్ లు తీసుకోని డేట్స్ అడ్జస్ట్ చేయకపోవడం, సెట్స్ లో వివాదాల కారణంగానే ఈ రెడ్ కార్డ్ ని ఇష్యూ చేసినట్లు తెలుస్తుంది.

ఎన్ రామ సామి నేతృత్వంలో తమిళనాడు నిర్మాతల మండలి జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దర్శకుడు గోకుల్ చిత్రం కరోనా కుమార్ నుంచి  వాకౌట్ చేసినందుకు శింబు కి రెడ్ కార్డ్ ఇవ్వగా..  లైకా ప్రొడక్షన్స్‌కు డబ్బులు తిరిగి చెల్లించనందుకు విశాల్ కి రెడ్ కార్డ్ జారీ చేశారు.

అదే విధంగా అడ్వాన్స్ తీసుకొని కూడా నిర్మాతలకు డేట్లు ఇవ్వనందుకు ఎస్‌జె సూర్య, యోగి బాబు, అధర్వలపై యాక్షన్ తీసుకున్నారని సమాచారం అందుతుంది. దీంతో ఇకపై ఇతర నిర్మాతలు ఈ నటులతో సినిమాలు చేసే ముందు కౌన్సిల్ ని తెలియజేయాల్సి ఉంటుంది. విశాల్, శింబు లాంటి స్టార్ హీరోలకు రెడ్ కార్డ్ ఇవ్వడం సినీ పరిశ్రమలో తీవ్ర సంచలనంగా మారింది. గతంలో స్టార్ కమెడియన్ గా చలామణీ అవుతున్న సమయంలోనే వడివేలుకి రెడ్ కార్డ్ ఇష్యూ చేసారు. దీంతో ఆయనకు దాదాపు పదేళ్ల పాటు సినిమా అవకాశాలే లేకుండా పోయాయి. మరి ఇప్పుడు ఈ విషయంపై ప్రముఖులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.