Pawan Kalyan : వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నానికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ఇచ్చిపడేశారు. పిఠాపురంలో జరిగిన వారాహి విజయ యాత్రలో ఆయన ప్రసంగిస్తూ.. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు తన రెండు చెప్పులు బయట వదిలి వెళ్తే ఎవరో కొట్టేశారని అన్నారు. అందుకే వైట్ అండ్ వైట్ లాల్చికి బదులుగా కలర్ మార్చాల్సి వచ్చిందని ఇన్ డైరెక్ట్ గా సెటైర్లు వేశారు. వైసీపీ ప్రభుత్వం చివరికి చెప్పులు కొట్టేసే స్థాయికి వచ్చిందని విమర్శించారు.
కాగా ఇటీవల పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఒక్క చెప్పు చూపిస్తే తాను రెండు చెప్పులు చూపిస్తానని.. వారాహి యాత్రను నారాహి యాత్రగా చెప్పుకొచ్చారు. చంద్రబాబును అధికారం లోకి తెచ్చేందుకు పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని .. రోజుకో డైలాగ్ చెప్పి దాన్ని వ్యూహామంటారని పవన్ తీరుపై పేర్ని నాని మండిపడ్డారు. వ్యూహాల్ని నమ్ముకుంటే అసెంబ్లీకి వెళ్లలేడని.. ప్రజలను నమ్ముకుంటేనే అసెంబ్లీలో అడుగుపెడతారని పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు. అందుకు గాను పవన్ ఇప్పుడు పేర్ని నాని వ్యాఖ్యలకు తనదైన శైలిలో మాస్ కౌంటర్స్ మామూలుగా ఇవ్వలేదని జన సైనికులు అభిప్రాయ పడుతున్నారు.
అదే విధంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాట్లాడుతూ.. వైసీపీ గూండాలను బట్టలూడదీసి కొట్టిస్తాను అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతల రౌడీయిజం పై తనదైన శైలిలో మండిపడ్డారు. నాకు క్రిమినల్స్ అంటే చిరాకు. గూండాగాళ్లు, హంతకులు, నేరస్తులతోటి పాలించబడటానికి సిగ్గుండాలి. నేను సినిమా మాటలు మాట్లాడటం లేదు. రియల్ లైఫ్ లో గొడవలు పెట్టుకోవడం నా కిష్టం. మాట్లాడితే సీఎం బటన్ నొక్కాను డబ్బులిచ్చాను అంటాడు. దళిత డాక్టర్ కరోనా సమయంలో మాస్కులు లేవంటే హింసించి పిచ్చివాడిగా చేసి చనిపోయేటట్లు చేసారు. దైర్యం ఉంటే గూండాలను మట్టిలో తొక్కేయవచ్చు. కులపరంగా, మతపరంగా విడిపోతే మనకే నష్టం అని పవన్ కళ్యాణ్ అన్నారు.
219 దేవాలయాలపై దాడులు జరిగితే ఒక్కరిని పట్టుకోలేదు. అంటే సగటు హిందువుకు, సనాతన ధర్మం పాటించే వాళ్లకి మిగతా మతాలమీద కోపం తెప్పించాలి. ఇది చచ్చు ముఖ్యమంత్రి ఆలోచన. ఈ వైసీపీ చచ్చు ప్రభుత్వం ఒక్కరినీ పట్టుకోలేదు. నేను మత పిచ్చి ఉన్నవాడిని కాను. ఎక్కడో దూరంగా ఉన్న మసీదులోనుంచి ప్రార్దన వినిసిస్తే దానికి గౌరవం ఇవ్వడం నేర్పింది నాకు హిందూ ధర్మం.ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. పోలీసులు ఏం చేయలేరు. బెత్లహామ్ వెళ్లినపుడు జీసస్ పుట్టిన నేలమీద మోకరిల్లాను. తిరుమలను కూడా అడ్డగోలుగా దోచేస్తున్నారు. ఏడుకొండల వేంకటేశ్వరుడితో ఆటలాడుకుంటున్నారు. నామరూపాలు లేకుండా పోతారు.జనసేన ప్రభుత్వం వస్తే మొదటి సారి బిగించేది లా అండ్ ఆర్డర్ నే. కాకినాడ ఎమ్మెల్యే లాగా రోజుకు రెండు కోట్ల మట్టిని తోలుకెళ్లను. ఆయన గురించి కాకినాడ సభలోనే మాట్లాడుతాను అని పవన్ అన్నారు.