Site icon Prime9

Nani: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌పై నాని ఆసక్తికర వ్యాఖ్యలు – ఏమన్నాడంటే..!

nani on pawan kalyan

Nani Comments on Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌పై హీరో నాని ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. హీరో రానా హోస్ట్‌గా అమెజాన్‌ ప్రైంలో ఓ టాక్‌ షో ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌ ఆరుళ్‌తో కలిసి నాని పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్‌లో గోవాలో జరుగుతున్న ఇఫీ వేడుకలో ప్రదర్శించారు. ఈ షోలో హీరో నాని, పవన్‌ కళ్యాణ్‌ను ఉద్దేశించి సినిమాల్లో ఆయన పవర్‌ స్టార్‌.. రాజకీయాల్లోనూ ఆయన పవర్‌స్టారే అని కొనియాడాడు. రానా షోలో నాని మాట్లాడుతూ.. “సినిమాల్లో పవన్‌ కళ్యాణ్‌ గారు ఎలా ఎదిగారో మనకు తెలిసిందే. అలాగే రాజకీయాల్లోనూ ఆయన అదే స్థాయిలో ఎదిగారు. అక్కడ కూడా పవర్‌ స్టార్‌ అని నిరూపించుకున్నారు. ఎంతోమందికి ఆయన స్ఫూర్తిగా నిలిచారు” అని అన్నాడు.

ఇక నాని కామెంట్స్‌పై రానా స్పందిస్తూ.. ఆయన చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారని, నిజంగానే ఆయన పవర్ స్టార్‌ అని వ్యాఖ్యానించాడు. కాగా ఏపీ ఎన్నికల సమయంలో నాని పవన్‌ కళ్యాణ్‌కు మద్ధతు ఇచ్చిన సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియాలో ఆయనకు సపోర్టు ఇస్తూ పోస్ట్‌ పెట్టి తన అభిమానాన్ని చాటుకున్నాడు. కాగా చివరిగా నాని, సరిపోదా శనివారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్నాడు. ప్రస్తుతం దసరా డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఒదెలతో ఓ సినిమా చేస్తున్నాడు. దసరా తర్వాత వీరిద్దరి కాంబో వస్తున్న రెండవ చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే రానా హోస్ట్‌గా అమెజాన్ ప్రైం వేదికగా ‘ది రానా దగ్గుబాటి షో’తో త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం ద్వారా ఫేమస్‌ సినీ సెలబ్రిటీలతో ముచ్చటిస్తూ వారి గురించి విషయాలను బయపెట్టనున్నాడు. ఈ షోలో హీరో నాని,ప్రియాంక మోహన్‌ అరుళ్‌, నాగ చైతన్య, సిద్ధు జొన్నలగడ్డ,ఎస్‌ఎస్‌ రాజమౌళి, రామ్‌ గోపాల్‌ వర్మ వంటి ఫేమస్‌ సెలబ్రిటీలు సందడి చేయనున్నారు. ఇటీవల ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదల కాగా దానికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అయితే ఈ షో తొలి ఎపిసోడ్‌ నాని, ప్రియాంక మోహన్‌ ఆరుళ్‌తో లిటిల్‌ సూపర్‌ హీరో తేజ సజ్జా కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రానా, నాని కలిసి తేజా సజ్జాను ఆటపట్టించిన తీరు చాలా ఫన్నిగా సాగింది. అంతేకాదు ఐఫా అవార్డు వేడుకలో వివాదంగా మారిన వారి కామెంట్స్‌ని నాని సరదాగా ఆటపట్టించాడు. కాగా ఇందుకు సంబంధించిన ఎపిసోడ్‌ను ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా(IFFI)వేడుకలో ప్రత్యేకంగా ప్రదర్శించారు.

Exit mobile version