Ind Vs NZ 2nd T20 : లక్నోలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ ఫ్యాన్స్ కి ఫుల్ మజా ఇచ్చింది.
100 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కష్టపడిన టీమిండియా మరో బంతి మిగిలి ఉండగా విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది.
భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
టార్గెట్ చిన్నదే కదా అని ఈజీ విన్ అని అంతా భావించారు. కానీ ఇక్కడే ఊహించని షాక్ ఇస్తూ టీమ్ ఇండియా బ్యాటర్లని న్యూజిలాండ్ కట్టడి చేసింది.
చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య మ్యాచ్ సాగిందంటే అతిశయోక్తి కాదు.
క్రికెట్ లవర్స్ ని ఎంతో టెన్షన్ పెట్టిన ఈ మ్యాచ్ లో భారత్ గెలుపొందింది.
6 వికెట్ల తేడాతో కివీస్ పై విక్టరీ కొట్టింది.
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ ను ఇండియన్ బౌలర్లు తక్కువ స్కోరుకు పరిమితం చేశారు.
కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి కేవలం 99 పరుగులే చేసింది.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 19 పరుగులతో అజేయంగా నిలిచాడు.
మార్క్ చాప్ మన్ 14, మైకేల్ బ్రేస్వెల్ 14, ఫిన్ అలెన్ 11, డెవాన్ కాన్వే 11 పరుగులు చేశారు. ధాటిగా ఆడే గ్లెన్ ఫిలిప్స్ 5 పరుగులకే ఔట్ కాగా, డారిల్ మిచెల్ (8) కూడా విఫలం అయ్యాడు.
టీమిండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, చహల్, కుల్దీప్ యాదవ్, దీపక్ హుడా చెరో వికెట్ తీశారు.
టార్గెట్ చిన్నదే కాబట్టి దీంతో అంతా గెలుపు భారత్ దే అనుకున్నారు.
కానీ, గ్రౌండ్ లోకి దిగాక 100 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు టీమిండియా బ్యాటర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరి బంతి వరకు వేచి చూడాల్సి వచ్చింది.
గత రెండు వన్డే సిరీస్ లలో దుమ్ము దులిపిన శుభ్‌మన్ గిల్ (11).. తాను టీ20లో ఆశించిన మేర రాణించలేకపోయాడు. బ్రాస్‌వెల్ బౌలింగ్ లో అనవసర షాట్ కు యత్నించి బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ వద్ద ఉన్న గ్లెన్ ఫిలిప్స్ చేతికి చిక్కాడు. తొలి పవర్ ప్లేలో భారత్ స్కోరు వికెట్ నష్టానికి 29 పరుగులే.
గిల్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన రాహుల్ త్రిపాఠి (18 బంతుల్లో 13, 1 ఫోర్) ఇష్ సోధి వేసిన 8వ ఓవర్ తొలి బంతికి ఫోర్ కొట్టాడు. కానీ తర్వాత ఓవర్ లో ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 19, 2 ఫోర్లు) అనవసర పరుగు కోసం యత్నించి రనౌట్ అయ్యాడు. పది ఓవర్లకు భారత్ రెండు వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది.
డ్రింక్స్ తర్వాత ఇష్ సోధి వేసిన 11వ ఓవర్ నాలుగో బంతికి రాహుల్ త్రిపాఠి.. భారీ షాట్ ఆడబోయి గ్లెన్ ఫిలిప్స్ కు క్యాచ్ ఇచ్చాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు వచ్చిన వాషింగ్టన్ సుందర్ (10) సూర్యతో సమన్వయం కోల్పోయి రనౌట్ అయ్యాడు.
చివరి రెండు ఓవర్లలో 12 పరుగులు అవసరం కాగా.. ఫెర్గూసన్ వేసిన 19వ ఓవర్లో ఐదు పరుగులొచ్చాయి.
ఇక చివరి ఓవర్లో భారత్ విజయానికి ఆరు పరుగులు అవసముండగా.. తొలి బంతికి హార్ధిక్ పాండ్యా (20 బంతుల్లో 15, 1 ఫోర్) సింగిల్ తీశాడు. రెండో బంతి డాట్ బాల్. మూడో బంతికి సూర్య ఒక్క పరుగు తీశాడు. నాలుగో బంతికి అదే కథ. ఐదో బంతికి సూర్య బౌండరీ కొట్టి భారత్ కు విజయాన్ని ఖాయం చేశాడు.
ఈ టీ20 మ్యాచ్ లో ఒక్క సిక్స్ కూడా లేకపోవడం గమనార్హం.
కివీస్ జట్టులో కానీ, భారత జట్టులో కానీ ఒక్క బ్యాటర్ కూడా సిక్స్ కొట్టింది లేదు.
కివీస్ బౌలర్లలో బ్రేస్ వెల్, సోదీ చెరో వికెట్ తీశారు.
ఇక కీలకమైన, సిరీస్ విజేతను నిర్ణయించే మూడో టీ20 మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 1న జరగనుంది.
అలానే కివీస్ జట్టులోని బౌలర్లలో కూడా ఈ మ్యాచ్ లో 8 మంది బౌలింగ్ చేయడం గమనార్హం.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/