Site icon Prime9

Team India : సింహాచలం అప్పన్నను దర్శించుకున్న టీమిండియా ఆటగాళ్లు..

Team India players visited simhachalam appanna temple

Team India players visited simhachalam appanna temple

Team India : ఆస్ట్రేలియా – టీమిండియాల మధ్య ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ నేడు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ఈ సాయంత్రం విశాఖలో జరగనుంది. మరోవైపు సింహాచలం అప్పన్నను టీమిండియా ఆటగాళ్లు నేడు దర్శించుకున్నారు. అప్పన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆటగాళ్లకు ఆలయ అధికారులు ఆహ్వానం పలికారు. దర్శనానంతరం క్రికెటర్లకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ షెడ్యూల్.. 

నవంబర్ 23, గురువారం: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా 1వ టీ20 మ్యాచ్

నవంబర్ 26, ఆదివారం: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా 2వ టీ20 మ్యాచ్

నవంబర్ 28, మంగళవారం: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా 3వ టీ20 మ్యాచ్

డిసెంబర్ 1, శుక్రవారం: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా 4వ టీ20 మ్యాచ్

డిసెంబర్ 3, ఆదివారం: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా 5వ టీ20 మ్యాచ్

భారత జట్టు..

ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ముఖేష్ కుమార్, వాషింగ్టన్ సుందర్, అవేష్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్, జితేష్ శర్మ.

ఈ సిరీస్ కు గాను సూర్యకుమార్ యాదవ్ టీమిండియా కెప్టెన్ గా… ఆస్ట్రేలియా కెప్టెన్ గా మాథ్యూ వేడ్ వ్యవహరిస్తున్నారు. మొన్న ముగిసిన ప్రపంచ కప్ లో ఉన్న వాళ్లలో కేవలం సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ప్రసిద్ధ్ కృష్ణ మాత్రమే ఈ సిరీస్ లో ఆడుతున్నారు. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలికంగా ఆ బాధ్యతను నిర్వహిస్తున్నాడు.

Exit mobile version