Navdeep Saini: టీమిండియాలో తాను ఎంపికవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన పేసర్ నవదీప్ సైనీ. కౌంటీ క్రికెట్‌లో ఆడేందుకు సిద్ధమైన నవదీప్ సైనీ.. తనకు భారత జట్టు నుంచి పిలుపు వచ్చిందంటూ ఆనందాన్ని పంచుకున్నాడు. కౌంటీ క్రికెట్ ఆడేందుకు యూకే వచ్చిన నవదీప్ సైనీ.. తాను వెస్టిండీస్ సిరీస్ ఆడేందుకు గానూ భారత జట్టులో ఎంపికయ్యానన్న వార్త విని ఆశ్చర్యపోయానని చెప్పారు.
‘నేను ఈ ఎంపికను ఊహించలేదు. నేను ఐపిఎల్‌లో డ్యూక్స్ బాల్‌తో ప్రాక్టీస్ చేసాను. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ సమయంలో నేను నెట్ బౌలర్‌గా ఎంపిక కావచ్చని అనుకున్నాను.’ అని నవదీప్ సైనీ అన్నాడు. వెస్టిండీస్ పర్యటనకు ముందు కౌంటీ మ్యాచ్ ఆడే అవకాశం ఉందని, వెస్టిండీస్ సిరీస్‌కు ఇది మంచి సన్నాహకమని సైనీ తెలిపాడు.
‘వెస్టిండీస్‌కు ఇది నా రెండో పర్యటన. నాకు చివరిసారి ఆడే అవకాశం రాలేదు. కానీ ఈసారి ఆ అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను. అక్కడి వాతావరణం గురించి నాకు తెలుసు. పిచ్‌లు నెమ్మదిగా ఉంటాయి.’ అని సైనీ చెప్పుకొచ్చాడు.
టీమిండియా టెస్టు జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షరు పటేల్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.