Site icon Prime9

ICC ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023 భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ.. ఎవరెవరు ఉన్నారంటే..?

ICC ODI World Cup 2023 team india players list announced

ICC ODI World Cup 2023 team india players list announced

Team India – ODI World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో పాల్గొనబోయే భారత జట్టును తాజాగా ప్రకటించారు. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఈ మేరకు జట్టు వివరాలు వెల్లడించారు. యువ ఆటగాళ్లు శుభమాన్ గిల్, ఇషాన్ కిషన్ లకు టీమ్ లో చోటు దక్కింది. కానీ తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు మొండి చేయి ఎదురైంది. కారు ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్న రిషబ్ పంత్ కు చోటు దక్కలేదు. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. సెలక్షన్‌ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన ప్రపంచకప్‌ జట్టును ఎంపిక చేసింది.

జట్టు వివరాలు.. 

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, మొహమ్మద్. సిరాజ్, కుల్దీప్ యాదవ్‌

 

Exit mobile version