Site icon Prime9

ICC World Cup 2023 IND vs PAK : ఇండియా vs పాక్ సమరానికి సై.. తక్కువ స్కోర్ కి ఆలౌట్ అయిన పాక్.. భారత్ టార్గెట్ 192.. లైవ్ అప్డేట్స్

ICC World Cup 2023 IND vs PAK match live updates

ICC World Cup 2023 IND vs PAK match live updates

ICC World Cup 2023 IND vs PAK :  ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023.. ఆద్యంతం ఆసక్తిగా సాగుతూ క్రికెట్ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తుంది. ఈ క్రమంలోనే ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న  ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ నేడు అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ వేదికపై చిరకాల ప్రత్యర్థులు పోటీ పడుతుండడం సర్వత్రా ఆసక్తి నింపుతుంది.

1992 నుంచి ఇప్పటివరకూ రెండు జట్లు ప్రపంచ కప్‌లో ఏడుసార్లు తలపడగా అన్నిసార్లూ భారత్‌ విజయం సాధించింది. తాజా ప్రపంచకప్‌లోనూ ఇదే జోరు కొనసాగించాలని టీమిండియా ఉవ్విళ్లురుతోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ పరంగా ఈ మ్యాచ్‌లో భారత్‌ జట్టు ఫేవరేట్‌గా కనిపిస్తుంది. డెంగ్యూ నుంచి కోలుకున్న శుభ్‌మన్‌ గిల్ నేటి మ్యాచ్ లో బరిలోకి దిగుతున్నాడు.

తుది జట్లు.. 

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

పాకిస్తాన్: అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్

Exit mobile version