Elephants Drink Country Liquor: ఒడిశాలో జరిగిన ఓ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గజరాజులు గటగటా నాటుసారా తాగేశాయి. ఆ తర్వాత మత్తెక్కడంతో ఆదమరచి నిద్రపోయాయి.
ఏనుగులు నాటుసారా తాగడం ఏంటీ.. మత్తులో తూగుతూ నిద్రించడం ఏంటి? అనే డౌట్ వచ్చింది కదూ. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలోని శిలపాడలోని గ్రామ ప్రజలు సమీప అడవిలో మహువా అనే ప్రత్యేక ఇప్పపువ్వను పులియబెట్టడం ద్వారా సాంప్రదాయ నాటుసారాను తయారు చేస్తారు. అయితే ఎప్పటిలాగానే వారు సారా తయారీకి పెద్దపెద్ద కుండలలో మహువా పువ్వు నీటిని పులియబెట్టి వెళ్లారు. మరుసటి రోజు వచ్చి చూసిన గ్రామస్థులకు అక్కడి కుండలన్నీ పగులగొట్టబడి పులియబెట్టిన నీరు ఖాళీ అయ్యి కనిపించింది. అంతే కాకుండా అక్కడికి పక్కనే ఓ 24 ఏనుగులు మత్తుగా నిద్రించడం గమనించారు. దానితో ఏనుగులను నిద్ర లేపేందుకు గ్రామస్థులు నానా ప్రయత్నాలు చేశారు. కానీ, ఎంతకీ గజరాజులు లేవలేదు. ఇక గ్రామస్తుల సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి డప్పులు కొట్టి శబ్ధం చేయడంతో ఏనుగులు లేచాయి. తిరిగి అడవిలోకి వెళ్లిపోయాయి. ఇకపోతే ఆ ఏనుగుల మందలో 9 మగ, 6 ఆడ ఏనుగులు, 9 కూన ఏనుగులు ఉన్నాయని అధికాలు తెలిపారు.
ఇదీ చదవండి: మద్యం మత్తులో అమ్మాయిల వీరంగం.. నడిరోడ్డుపై ఏం చేశారో చూస్తే షాక్