Site icon Prime9

Viral News : మద్యం ఇవ్వలేదని వైన్‌ షాప్‌ను తగలబెట్టిన మందుబాబు..

Viral News :  మద్యం ఇవ్వలేదనే కోపంతో ఓ మందుబాబు ఏకంగా వైన్ షాపును తగాలబెట్టడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటన విశాఖపట్నం మధురవాడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వైన్‌షాప్‌ లోపల, సిబ్బందిపైనా పెట్రోల్‌ పోసి నిప్పంటించగా.. సిబ్బంది పరుగులు తీశారు. కానీ వైన్‌షాప్‌ మంటల్లో పూర్తిగా కాలిపోవడంతో రూ.1.5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మధురవాడ ప్రాంతంలోని ఓ వైన్‌ షాప్‌ వద్దకు మధు అనే వ్యక్తి.. శనివారం రాత్రి మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చాడు. అయితే అప్పటికే షాప్‌ మూతపడే సమయంలో కావడంతో సిబ్బంది అతనికి మద్యం ఇవ్వలేదు. దీంతో వారితో వాగ్వాదానికి దిగిన అతను అక్కడి నుంచి వెళ్లిపోయి ఆదివారం సాయంత్రం పెట్రోల్‌ డబ్బాతో వచ్చిన అతను వైన్‌షాప్‌ లోపల, సిబ్బందిపైనా పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. దీంతో సిబ్బంది వెంటనే షాప్‌ బయటకు పరుగులు తీశారు. కానీ వైన్‌షాప్‌ మంటల్లో పూర్తిగా కాలిపోయింది.

ఈ ఘటనలో షాప్ లోని కంప్యూటర్‌, ప్రింటర్‌ ఇతర సామగ్రి కాలిపోయి రూ.1.5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. వైన్ షాపు సిబ్బంది ఫిర్యాదుతో నిందితుడు మధును అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

 

Exit mobile version
Skip to toolbar