Site icon Prime9

Bangladesh Women Love Story : భర్తను, కొడుకును వదిలేసి.. ప్రియుడి కోసం భారత్‌ వచ్చేసిన బంగ్లాదేశ్ మహిళ

trending news of Bangladesh Women Love Story full details

trending news of Bangladesh Women Love Story full details

Bangladesh Women Love Story : ప్రేమ గురించి వర్ణించాలంటే.. మాటల్లో చెప్పలేనిది అనే మాట మాత్రం వాస్తవం. ఇక ఇటీవల ప్రేమ దేశాల్ని ఖండాల్ని కూడా దాటేస్తుంది. ప్రేమ పేరుతో వివాహాలు అయినవారు కూడా కుటుంబాలను వదిలేసి ఏకంగా దేశ సరిహద్దులు దాటుతున్న ఘటనలు జరుగుతున్నాయి. రీసెంట్ గానే పాకిస్థాన్ నుంచి సీమా హైదర్ ఇండియా కి వచ్చేస్తే.. ఇండియా నుంచి మరో మహిళ పాకిస్థాన్ కి వెళ్ళిపోయింది. ఈ ఇరు ఘటనల్లో వారు పెళ్లి చేసుకున్న భర్తల్ని కూడా వదిలేసి వచ్చేశారు. ఇప్పుడు తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి నమోదయ్యింది.

వివరాల్లోకి వెళ్తే.. బంగ్లాదేశ్ కు చెందిన ఓ మహిళ తన భర్త, కుమారుడ్ని వదిలేసి ప్రియుడి కోసం దేశ సరిహద్దులు దాటి భారత్ వచ్చేసింది. త్రిపురకు చెందిన నూర్ జలాల్ అనే 34 ఏళ్ల వ్యక్తి ఆయుర్వేదం డాక్టర్ గా పనిచేస్తున్నాడు. అతను తరచు బంగ్లాదేశ్ కు వెళ్లి వస్తుండేవాడు. అక్కడి మౌల్వీ బజార్ కు వెళ్లి వస్తుండేవాడు. ఈ క్రమంలో అతనికి బంగ్లాదేశ్ కు చెందిన ఫతేమా నుస్రత్ అనే 24 ఏళ్ల మహిళతో పరిచయం అయ్యింది. వారి పరిచయం ప్రేమగా మారింది. ఈ మేరకు భర్తను..కుమారుడ్ని వదిలేసి అక్రమంగా దేశ సరిహద్దులు తాటి భారత్ లోకి అడుగు పెట్టింది.

డాక్టర్ ఉండే ఉత్తర త్రిపురలోని ధర్మనగర్ ఫుల్ బరీకి వచ్చేసింది. నూర్ కు వివాహం కాకపోవడంతో అతన్ని వివాహం చేసుకునేందుకు భారత్ వచ్చేసింది. వచ్చకా అతనితోనే కలిసి ఉంటోంది. ఈ విషయంపై సమచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. అనుమతి లేకుండా భారత్ వచ్చిన ఇక్కడే నివసిస్తున్న ఫతేమాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. దీంతో ధర్మాసనం ఫతేమాకు 14 రోజలపాటు జ్యుడిషియల్ కస్టడీ పంపిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే ఆమెను పెళ్లి చేసుకున్న ఆయుర్వేద వైద్యుడు నూర్ కనిపించకుండాపోవడం గమనార్హం. దీంతో పరారీలో ఉన్న నూర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ వార్త దేశం వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version