Site icon Prime9

Drunken Girls: మద్యం మత్తులో అమ్మాయిల వీరంగం.. నడిరోడ్డుపై ఏం చేశారో చూస్తే షాక్

drunken girls doing nonsense in mid nights on road in Madhya Pradesh

drunken girls doing nonsense in mid nights on road in Madhya Pradesh

Drunken Girls: నేటి సమాజంలో పబ్ కల్చర్ శరవేగంగా విస్తరిస్తోంది. ఆడమగ వయసు వ్యత్యాసం లేకుండా తెగతాగేస్తున్నారు. తాగేసి గుట్టుచప్పుకుకాకుండా కొందరు ఉంటే మరికొందరు ఆ మైకంలో వారేం చేస్తున్నారో వారికే తెలియకుండా రోడ్డుపై నానా రచ్చ చేస్తుంటారు. ఈ కోవకు చెందినదే ఈ వీడియో మరి ఆ ఘటన ఏంటి ఎక్కడ జరిగిందో ఓ సారి చూసెయ్యండి.

మరొకొందరు యువతిలు తాగిన మత్తులో రోడ్డుపై వీరంగం సృష్టించారు. సమానత్వం మరిచి మరో యువతిని నానా రకాల చిత్ర హింసలకు గురిచేశారు. పబ్‌ బయట ఒకరినొకరు తన్నుకుంటూ నలుగురు అమ్మాయిలు కలిసి మరో అమ్మాయిపై బెల్ట్‌లు, చెప్పులతో దాడి చేశారు. కర్రలతో దారుణంగా చితక్కొట్టారు. మాకేం పట్టింది మధ్యలో కలుగజేసుకోవడం ఎందుకు అన్నట్టు ఈ అమ్మాయిల గొడవను అక్కడున్నవారందరూ సినిమా చూసినట్లు చూశారే కానీ ఎవరూ కూడా వారిని ఆపే ప్రయత్నం చేయలేదు.
మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో కాస్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పబ్ బయట ఓ నలుగురు అమ్మాయిలు కలిసి మరో యువతిని జుట్టుపట్టి లాగుతూ, కిందపడేసి మరీ పిచ్చపిచ్చగా కొట్టారు. బాధితురాలైన మరో యువతి సహాయం కోసం కేకలు వేసినప్పటికీ అక్కడున్న వారు ఆ ఘటన మొత్తాన్ని తమాషా చూసినట్లు చూస్తున్నారే కానీ ఎవరూ ఆ దాడిని ఆపే ప్రయత్నం చెయ్యలేదు.
కాగా తాజాగా ఈ వీడియో నెట్టింట వైరల్‌ కావడంతో ఈ సంఘటన మొత్తం ఇండోర్‌ పోలీసుల దృష్టికి వెళ్లింది. అసలు ఆ యువతిని ఎందుకలా కొట్టారు అన్నది పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఇదీ చదవండి:  పట్టాలు తప్పిన గూడ్స్.. పలు రైళ్లు రద్దు

Exit mobile version