Elon Musk: గ్యారేజీలో నిద్రించిన ఎలాన్‌మస్క్ తల్లి
టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల సీఈఓ, ప్రపంచ కుబేరుడు అయిన ఎలాన్ మస్క్ తల్లి మే మస్క్ ఇటీవల ఒక గ్యారేజీలో నిద్రించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఆమె ‘ద సండే టైమ్స్’ పత్రికతో పంచుకున్నారు. కుమారుడు ఎలాన్ మస్క్‌ను కలిసేందుకు స్పేస్ ఎక్స్ ప్రధాన కార్యాలయం ఉన్న అమెరికా

Elon Musk: టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల సీఈఓ, ప్రపంచ కుబేరుడు అయిన ఎలాన్ మస్క్ తల్లి మే మస్క్ ఇటీవల ఒక గ్యారేజీలో నిద్రించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఆమె ‘ద సండే టైమ్స్’ పత్రికతో పంచుకున్నారు. కుమారుడు ఎలాన్ మస్క్‌ను కలిసేందుకు స్పేస్ ఎక్స్ ప్రధాన కార్యాలయం ఉన్న అమెరికాలోని టెక్సాస్‌కు వెళ్లాలని, అక్కడికి సమీపంలోని ఇల్లేమీ లేదని, అందుకే ఒక గ్యారేజీలో నిద్రించానని తెలిపారు. అంగారక గ్రహంపైకి వెళ్లాలన్న కోరిక తనకు లేదని పేర్కొన్నారు. తనకు సొంత ఇల్లు లేదని ఇటీవలే ఎలాన్ మస్క్ వెల్లడించారు.