Rishi Sunak : బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కు ఇంటిపోరు… పన్నుల పెంపును వ్యతిరేకించిన ఎంపీలు

బ్రిటన్‌ ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించిన రిషి సునాక్‌కు సొంత పార్టీ సభ్యుల నుంచే అసమ్మతి సెగ మొదలయింది.

  • Written By:
  • Updated On - December 13, 2022 / 06:22 PM IST

Rishi Sunak : బ్రిటన్‌ ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించిన రిషి సునాక్‌కు సొంత పార్టీ సభ్యుల నుంచే అసమ్మతి సెగ మొదలయ్యింది. వచ్చే బడ్జెట్‌లో కొన్ని రాయితీలు ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. బ్రిటన్‌లో నలబై ఏళ్ల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం ఎగబాకింది. జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. ఈ చలికాలంలో ఇంధన బిల్లులు రెట్టింపు అయ్యాయి. అలాగే పన్నులు తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కన్సర్వేటివ్‌ పార్టీకి చెందిన సుమారు 40 మంది ఎంపీలు ఆర్థికమంత్రి జెర్మీ హంట్‌కు ఆదివారం నాడు ఓ లేఖ రాశారు.

రెండవ ప్రపంచయుద్ధం తర్వాత బ్రిటన్‌ పౌరులపై ఈ స్థాయిలో ఏ ప్రభుత్వం పన్నుల భారం మోపలేదని ఘాటు లేఖ రాశాయి. ప్రజలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. పన్ను చెల్లింపుదార్ల ప్రతి పెన్నీ వృధా కారాదని, వారి డబ్బుకు తగ్గ విలువ ఇవ్వడంతో పాటు ప్రజల సొమ్ము వృధా కారాదని ఆ లేఖలో ప్రస్తావించారు. సునాక్‌ పార్టీకి చెందిన 40 మంది సభ్యులు తమను తాము కన్సర్వేటివ్‌ వే ఫార్వర్డ్‌ అని అభివర్ణించుకున్నారు. సోమవారం నాడు ప్రచురించిన ఈ రిపోర్టులో సుమారు ఏడు బిలియన్‌ పౌండ్ల ప్రజల సొమ్ము వృధా అవుతోందని.. దానికి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. దీంతో పాటు ప్రభుత్వం పన్నురేట్లు తగ్గించాలని.. దీంతో ప్రజలు తమ అవసరాల కోసం పెద్ద ఎత్తున వ్యయం చేసుకోవడానికి వీలవుతుందని సూచించారు.

కాగా ఈ గ్రూపునకు మాజీ హోంమంత్రి ప్రీతి పాటిల్‌ మద్దతు తెలిపారు. ట్రస్‌ను ప్రధానమంత్రిగా ఎంపిక చేసిన తర్వాత రిషి సునాక్‌ను ఎంపిక చేసుకున్నారు కన్సర్వేటివ్‌ ఎంపీలు. ప్రస్తుతం ప్రజలకు ప్రజాస్వామ్యంపైన.. కన్సర్వేటివ్‌ పార్టీపై నమ్మకం పోతోందని ఎంపీలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని సునాక్‌ విధాన నిర్ణయాలు తీసుకోవడంతో పలు యూ టర్న్‌లు తీసుకున్నారు. వాటిలో శిలాజ ఇంధనాల ఉత్పత్తి, పవన్‌ విద్యుత్‌ ద్వారా వ్యవసాయం చేస్తామని..హౌసింగ్‌ ప్రాజెక్టులు చేపడతామని గొప్పగా ప్రకటించారు. పార్టీ ఎంపీల నుంచి వ్యతిరేక వ్యక్తం కావడంతో ఈ ప్రతిపాదనలను విరమించారు. ఇలాంటి ప్రకటనలే లిజ్‌ ట్రస్‌ కూడా గుప్పించారు. పన్నులు భారీగా తగ్గిస్తామని ప్రకటించి ఎంపీల నుంచి విమర్శలు ఎదుర్కొని తర్వాత ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు.