Site icon Prime9

Oman Mosque Attack: ఒమన్ మసీదు సమీపంలో కాల్పులు.. భారతీయుడు తో సహా ఆరుగురి మృతి

Oman Mosque Attack

Oman Mosque Attack

Oman Mosque Attack: ఒమన్‌లోని ఇమామ్ అలీ మసీదు సమీపంలో జరిగిన కాల్పుల్లో ఒక భారతీయుడుతో సహా ఆరుగురు మరణించగా 28 మంది గాయపడ్డారు. జూలై 15న మస్కట్ నగరంలో జరిగిన కాల్పుల ఘటనలో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడని, మరొకరు గాయపడ్డారని ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. దౌత్య కార్యాలయం తన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తోందని బాధితుల కుటుంబాలకు అన్ని సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉందని ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం X లో ట్వీట్‌లో పేర్కొంది.

షియాలను టార్గెట్ చేసి..(Oman Mosque Attack)

సోమవారం రాత్రి అల్-వాడి అల్-కబీర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు దాడి చేసిన వారిని కూడా భద్రతా దళాలు హతమార్చాయని ఒక ప్రకటనలో తెలిపారు.ఇమామ్ అలీ మసీదుపై ‘ఉగ్రదాడి’లో మరణించిన వారిలో నలుగురు పాకిస్థానీలు కూడా ఉన్నారని పాకిస్థాన్ పేర్కొంది. ఈ దాడికి తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ వంటి దేశాల్లోని షియా వేడుకలు, ఊరేగింపులు, ఆరాధకులను ఐసిస్ పదే పదే టార్గెట్ చేసింది. కానీ షియాలు మైనారిటీలుగా ఉన్న ఒమన్‌లో దాడికి పాల్పడినట్లు ఇంతకు ముందెన్నడూపేర్కొనలేదు..

 

Exit mobile version