Israeli Airstrikes: గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో సుమారుగా 60 మంది మరణించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. నిరాశ్రయులకు షెల్టర్ జోన్ గా ఉన్న పాఠశాల, మరొక ప్రాంతంపై ఈ దాడులు జరిగాయి. కాగా, దాదాపు 10 నెలలుగా కొనసాగుతున్న వివాదంలో కాల్పుల విరమణ చర్చలు మరోసారి నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
దాడులు జరిగిన ప్రాంతాలు..(Israeli Airstrikes)
ఇజ్రాయెల్ గతంలో తరలింపు జోన్‌గా ప్రకటించిన వందల వేల మంది నిర్వాసితులతో నిండిన మధ్యధరా తీరప్రాంతంలోని మావాసిలోని పెట్రోల్ బంకు సమీపంలో జరిగిన బాంబు దాడిలో 17 మంది మరణించారు.సెంట్రల్ గాజాలోని నుసిరత్ శరణార్థి శిబిరంలో యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో నడిచే అల్-అవ్దా పాఠశాలను లక్ష్యంగా చేసుకున్న దాడిలో మరో 16 మంది మరణించారు.హమాస్ తీవ్రవాదులు పాఠశాలలో ఉన్నారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) ఒక ప్రకటనలో పేర్కొంది.ఇజ్రాయెల్ వైమానిక దళం మంగళవారం గాజాలో స్నిపింగ్ మరియు అబ్జర్వేషన్ పోస్ట్‌లు, సైనిక నిర్మాణాలు మరియు పేలుడు పదార్థాలతో రిగ్గింగ్ చేసిన భవనాలతో సహా దాదాపు 40 స్దావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు సైన్యం తెలిపింది. గత రెండు వారాలుగా, ఇజ్రాయెల్ పాలస్తీనా భూభాగంపై తీవ్రమైన దాడులకు పాల్పడింది. వీటిలో శనివారం హమాస్ మిలిటరీ కమాండర్ మహ్మద్ దీఫ్‌ను లక్ష్యంగా చేసుకున్న దాడిని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఈ దాడిలో 90 మందికి పైగా మరణించారు.