Home / టాలీవుడ్
హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ చిత్రం సూర్య 42. ఈ మూవీ మోషన్ పోస్టర్ విడుదల చేసి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చిన చిత్ర బృందం.
లైగర్ సినిమాను భారీ అంచనాల నడుమ విడుదల చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు ఈ సినిమా వల్ల ఎంత మంది ఇబ్బంది పడుతున్నారో తెలుసు కుందాం. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడానికి ఒక విధంగా విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్ కారణమని గుస గుసలు విపిస్తున్నాయి అంతే కాకుండా కరణ్ జోహార్ కూడా కారణమని టాలీవుడ్ పెద్దల నోటి నుంచి వస్తున్న మాట.
టాలీవుడ్ లో ప్రముఖ కథానాయిక సమంత నటిస్తున్న తాజా చిత్రం యశోద. లేడీ ఓరియెంటెడ్ కథతో రూపొందించబడిన ఈ సినిమా త్వరలో విడుదలకానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం టీజర్ ను రిలీజ్ చేసింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఇక తెలుగు ప్రజలు అయితే ఆమెను చూసి "ఏమాయచేశావే" అంటారు. "మనం" అంటూ ఆమెపై ఆత్మీయత చూపుతారు. తన అందచందాలతో నటనతో అభిమానులను టాలీవుడ్ "మజిలి"కి చేర్చిన అందాల భామ.
లైగర్ డిజాస్టర్ తర్వాత, విజయ్ దేవరకొండ మరియు పూరి జగన్నాధ్ల కాంబోలో ’జనగణమన‘ చిత్రం పై చాలా పుకార్లు కొనసాగుతున్నాయి. మరోవైపు లైగర్ సహ నిర్మాత ఛార్మి తాను కొంతకాలం సోషల్ మీడియా నుండి విరామం తీసుకుంటానని, త్వరలో తిరిగి వస్తానని చెప్పారు.
పుష్ప: ది రైజ్ సూపర్ సక్సెస్ తర్వాత, అల్లు అర్జున్ మరియు సుకుమార్ పూర్తిగా పుష్ప: ది రూల్ పై దృష్టి పెట్టారు. ప్రీ-ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తయింది మరియు షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు సుకుమార్ తన కుటుంబంతో హాలిడేలో ఉన్నాడు.
నటి సమంత ఇటీవల కొన్ని ప్రత్యేక పూజలు చేసినట్లు సమాచారం. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పూజారుల బృందం పాల్గొని ఆమెను ఆశీర్వదించారు. సమంత పూజకు సంబంధించిన కొన్ని చిత్రాలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి.
కిరణ్ అబ్బవరం, తన తదుపరి చిత్రం ’నేను మీకు బాగా కావాల్సినవాడిని‘లో మాస్ అవతారంలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఇటీవలి నెలల్లో ఆసక్తిని రేకెత్తించే టీజర్ మరియు పాటలతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మాస్ ఎంటర్టైనర్కి కిరణ్ అబ్బవరం స్వయంగా స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ అందించగా శ్రీధర్ గాధే దర్శకత్వం వహించారు.
మెగాస్టార్ అభిమానులంతా గాడ్ ఫాదర్ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ఆచార్య మూవీ మెగాఫ్యాన్స్ ను నిరాశపచడంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న గాడ్ ఫాదర్ మూవీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం 'ఒకే ఒక జీవితం'. అయితే చిత్ర యూనిట్ ఈ మూవీ ప్రమోషన్స్ ను వేగంగా చేపడుతుంది. దీనిలో భాగంగా టాలీవుడ్ సినీ ప్రముఖుల కోసం ప్రీమియర్ షో వేశారు. మూవీ చూసిన టాలీవుడ్ హీరో కింగ్ నాగార్జున థియేటర్లోనే కన్నీళ్లు పెట్టుకున్నారంటా... తన తల్లిని గుర్తు చేసుకుంటూ ఏడ్చేశానని ఆయన తెలిపారు.