Home / టాలీవుడ్
వైష్ణవ్ తేజ్ తన మొదటి సినిమా ఉప్పెన తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి, తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.తన నటించిన రెండో సినిమా ‘ కొండపొలం ‘ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు మూడో సినిమా “రంగరంగవైభవంగా “అంటూ మన ముందుకు వచ్చేశాడు.ఈ సినిమా సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన”రంగరంగ వైభవంగా” సినిమా రివ్యూ ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం. కథ రిషి(వైష్ణవ్), రాధ(కేతికా శర్మ) ఇద్దరు చిన్నప్పటి మంచి […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా రిలీజయిన హరి హర వీర మల్లు యొక్క 'పవర్ గ్లాన్స్' యూట్యూబ్‌లో సంచలనం రేకెత్తించింది. ఒక రోజు వ్యవధిలో, 'పవర్ గ్లాన్స్' 10+ మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించి యూట్యూబ్ లో అగ్రస్థానంలో ఉంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాహో ఫేమ్ సుజిత్‌తో చర్చలు జరుపుతున్నారు. వీరిద్దరి కాంబోలో చిత్రం వస్తుందని గత కొద్దికాలంగా ఊహాగానాలు వెలువుడుతున్నాయి. ఈ చిత్రం తమిళ బ్లాక్ బస్టర్ థెరికి రీమేక్ అని కూడ టాక్. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ప్రణాళికలు మారాయి.
హీరో శర్వానంద్ డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో కూడిన సినిమాలు మాత్రమే చేస్తానని ఇటీవల ప్రకటన చేశాడు. శర్వానంద్ తన 33వ సినిమా కోసం కృష్ణ చైతన్యతో జతకట్టాడు. శర్వానంద్ 33వ చిత్రం విభిన్నమైన కథ మరియు శక్తివంతమైన పాత్రలతో కూడిన రాజకీయ యాక్షన్ డ్రామా.
గత కొన్నేళ్లుగా ఎక్కువగా కామెడీ పాత్రల్లో కనిపించిన హీరో అల్లరి నరేష్. ఇపుడు కొత్త జోనర్ లో వెడుతున్నాడు. నరేష్ ఇప్పుడు విభిన్నమైన సబ్జెక్ట్‌లను వెతుకుతున్నాడు. ఇందులో భాగమే విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందిన చిత్రం నాంది.
నటి తమన్నా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్‌తో బబ్లీ బౌన్సర్ సినిమా కోసం జతకట్టింది. కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేశారు. తమన్నా బౌన్సర్లను ఉత్పత్తి చేసే ఫతేపూర్‌కు చెందిన బబ్లీ అనే యువతి పాత్రను పోషిస్తుంది.
టాలీవుడ్ ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కమ్యూనిస్టు నేత నారాయణకు అలవాటు. మెగాస్టార్ చిరంజీవి మరియు జూనియర్ ఎన్టీఆర్ తర్వాత, నారాయణ రియాలిటీ షో, బిగ్ బాస్ హోస్ట్ అయిన కింగ్ నాగార్జునపై తాజాగా విరుచుకుపడ్డారు.
Tollywood: కథ వరంగల్‌లో చిన్న పిల్లలు ఒకరి తర్వాత ఒకరు కిడ్నాప్ అవుతూనే ఉంటారు అసలు ఈ కిడ్నాప్‌లు ఎలా జరుగుతున్నాయా అని , దాన్ని ఛేదించడానికి మట్వాడ పోలీసు స్టేషన్‌కు కేశవ నాయుడు(ధన్‌రాజ్) కొత్తగా డ్యూటిలో చేరతారు. ఈ కేసును ఛేదించే సమయంలో రెండు కొత్త ముఠాలు పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారని తెలుసుకుంటారు.అప్పుడే వాళ్ళలో కొంత మంది ముఠాలోని పిల్లలను ముంబైకి పంపించాలనుకుంటారు. మరో ముఠా 8ఏళ్ళ పిల్లల గుండెని తీసేసి, వాళ్ళ మృతదేహాలను అక్కడే […]
లైగర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో పూరి జగన్నాధ్ తదుపరి చిత్రం జనగణమన పై దాని ప్రభావం పడింది. ఈ సినిమా నిర్మించే మై హోమ్ గ్రూప్ ప్రాజెక్టును వదిలేసినట్లు సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మరియు సినిమా మొదటి రెండు షెడ్యూల్స్ కోసం 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిసింది.
"బ్రహ్మాస్త్రం" సినిమా ప్రెస్ మీట్ నిన్న హైద్రాబాద్ లో జరిగినది. ఈ ప్రెస్ ఈవెంటుకు ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ హాజరయ్యారు. నాగార్జున, రాజమౌళి,రణబీర్ కపూర్, అలియా భట్, కరణ్ జోహార్ నటీనటులు పాల్గొన్నారు.