Ustaad Bhagat Singh : పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా !!!
వర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో `ఉస్తాద్ భగత్ సింగ్` ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తమిళ్ సూపర్ హిట్ సినిమా ‘తేరి’కి రీమేక్ గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తెరకెక్కుతుంది. గతేడాది డిసెంబర్ 11న గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు
Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో `ఉస్తాద్ భగత్ సింగ్` ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తమిళ్ సూపర్ హిట్ సినిమా ‘తేరి’కి రీమేక్ గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తెరకెక్కుతుంది. గతేడాది డిసెంబర్ 11న గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు జరిగిన విషయం తెలిసిందే. మొదట ఈ సినిమాకి భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేయగా.. తర్వాత టైటిల్ ని మార్చి ఉస్తాద్ భగత్ సింగ్ అని ఖరారు చేశారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ చిత్రం పట్టాలెక్కడం ఆలస్యం అవుతూ వచ్చింది. కాగా ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు.
‘గబ్బర్ సింగ్’ సినిమా తరువాత పవన్-హరీష్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండడం మరో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది ఈ మూవీ. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకుంది. ఈ చిత్ర సెకండ్ షెడ్యూల్ షూటింగ్ త్వరలో మొదలు కానున్నట్లు వెల్లడించింది.
ఈ మేరకు హైదరాబాద్‌లో ఆర్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఓ భారీ సెట్‌ను ఇందుకోసం సిద్దం చేస్తున్నట్లు చెప్పింది. ఈ షెడ్యూల్‌లో పవన్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఫస్ట్ షెడ్యూల్‌కు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ను పోస్ట్ చేసింది. మరోసారి చరిత్రను తిరగరాద్దాం అంటూ రాసుకొచ్చింది.
Team #UstaadBhagatSingh is gearing up for the next Massive schedule with Blockbuster energy 💥💥
Let’s rewrite history once again ❤️🔥@PawanKalyan @harish2you @sreeleela14 @ThisIsDSP @DoP_Bose #AnandSai @ChotaKPrasad @SonyMusicSouth @UBSTheFilm pic.twitter.com/Ci8fz2JN2H
— Mythri Movie Makers (@MythriOfficial) July 2, 2023