Home / క్రైమ్
బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కరటోయా నదిలో ఓ పడవ బోల్తా పడటంతో 23 మంది మృతి చెందగా, పలువురు గల్లంతు అయ్యారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ శివారు గ్రామంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఓ దారుణం జరిగింది. వివాహితపై సామూహిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
బాత్రూమ్లో 19 ఏళ్ల యువతి దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాన్ని ముగ్గురు విద్యార్థులు వీడియో తీశారు. ఆ క్లిప్‌ను సోషల్ మీడియాలో విడుదల చేస్తానని బెదిరించి ఆమె నుంచి డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నించారు. తీరా చూస్తే అసలు విషయం తెలుసుకుని రంగ ప్రవేశం చేసిన పోలీసులకు నిందితుల్లో ఒకరు చిక్కారు, మిగిలిన వారు పరారీలో ఉన్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చోటుచేసుకుంది.
అనంతపురం జిల్లా గార్లదిన్నెలో ఈ దినం ఉదయం చోటుచేసుకొన్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు
అబలల పై దాడులు ఆగడం లేదు. అకారణంగా మహిళల పై దాడులు చేస్తూ భయాందోళనలు రేకెత్తిస్తున్నారు. తాజాగా భాగ్యనగరంలోని ఉస్మానియా యూనివర్శిటీ సమీపంలో దారుణం చోటుచేసుకొనింది
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల సమీపంలోని రామ్ కో సిమెంటు ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఇద్దరు కార్మికులు మృత్యువాత పడ్డారు. కర్మాగారంలోని ఎత్తైన ర్యాంపులు కూలిపోవడంతో ఘటన చోటు చేసుకొనింది.
తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఓ తల్లి తన ముగ్గురు పిల్లలతో సహా చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లితో సహా ఇద్దరు కవల పిల్లలు మరణించారు.
విద్యాబుద్దులు నేర్పుతున్న గురువులు ఏమన్నా పడే రోజులు పోయాయ్. ఒకప్పుడు బెత్తంతో భయం చెప్పినా కిక్కురుమనకుండా విద్యనభ్యసించడం చూశాం కానీ ఇప్పుటి కాలం విద్యార్థులైతే అందుకు భిన్నంలెండి. తరగతి విద్యార్థుల ముందు టీచర్ తిట్టాడని నామోషీగా ఫీల్ అయ్యాడో ఏమో తెలియదు కానీ ఆ కోపంతో ఓ పదో తరగతి విద్యార్థి ఉపాధ్యాయుడిపై కాల్పులు తెగబడ్డాడు. నాటు తుపాకీతో టీచర్‌ను వెంబడించిన మరీ ఏకంగా మూడు రౌండ్లు కాల్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.
అగ్నిప్రమాదం ఆ వైద్యుడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో.. అక్కడే నివాసం ఉంటున్న వైద్యుడి కుటుంబం మంటల్లో చిక్కుకుని వైద్యునితోపాటు ఆయన ఇద్దరు పిల్లలు మృతి చెందారు. ఈ హృదయ విదారక ఘటన తిరుపతి జిల్లా రేణిగుంటలో చోటుచేసుకుంది.
ప్రపంచంలో ఏదో ఓ మూల రోజూ మరణ వార్తలు వింటూనే ఉన్నాం. అందులోనూ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతాని వలసవెళ్లే వారూ ఉంటారు. కాగా తాజాగా సిరియాలో ఘోర ప్రమాదం జరిగింది. సిరియా తీరంలో బోటు బోల్తాపడి దానిలోని 77 మంది ప్రయాణికులు మృతి చెందారు. మృతులంతా వలసదారులుగా అధికారులు గుర్తించారు.