Home / క్రైమ్
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఘటనలో సీబిఐ తన దర్యాప్తును వేగవంతం చేసింది. కొంతకాలంగా స్ధబ్దుగా ఉన్న సీబిఐ విచారణ తిరిగి ఊపందుకొనింది.
ఖమ్మం జిల్లాలోనే మరో ఇంజక్షన్ హత్య వెలుగు చూసింది. బైక్ పై లిఫ్ట్ అడిగి ఇంజక్షన్ ఇచ్చి హత్య చేసి ఘటన మరువక ముందే అలాంటి మరో ఘటన వెలుగులోకి రావడం ఖమ్మం జిల్లా ప్రజలను కలవరపెడుతుంది.
ఉత్తరప్రదేశ్లో నేరాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయని చెప్పవచ్చు. మొన్నామధ్య మైనర్ దళిత బాలికలైన అక్కాచెళ్లెల్లపై అత్యాచారం చేసి చెట్టుకు వేలాడదీసిన ఘటన మరువకముందే అదే తరహా ఘటన మరొకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. యూపీలోని మొరాదాబాద్ జిల్లా ఓ మైనర్ బాలికపై కొంతమంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా ఆ బాలిక సృహలోకి వచ్చిన తర్వాత రక్తం కారుకుంటూ నగ్నంగా రోడ్డుపై నడుచుకుంటూ తన ఇంటికి చేరుకుంది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది.
హిందూపురం పురపాలక సంఘ కార్యాలయంలో పనిచేస్తున్న రెవిన్యూ ఇన్స్ పెక్టర్ షఫీఉల్లా ఏసిబీ వలలో చిక్కారు. 15వేల లంచం తీసుకొంటూ ఏసిబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు
ఓ ఎలక్ట్రానిక్ షోరూంకి కన్నమేసిన రూ. 70 లక్షలకు పైగా విలువైన చరవాణీలను చోరీ చేశాడు.. కానీ అక్కడనున్న ల్యాప్టాప్లు కానీ మరే ఇతర వస్తువుల జోలికి కానీ అతడు వెళ్లకపోవడం గమనార్హం. ఈ ఘటన హైదరాబాద్లోని ఈసీఐఎల్ చౌరస్తాలో జరిగింది.
ఖమ్మం జిల్లాలో ఇటీవలె లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తినే ఇంజెక్షన్ ఇచ్చి చంపిన ఘటన విధితమే. కాగా ఆ హత్యపై పోలీసులు దర్యాప్తు చెయ్యగా వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని వెల్లడయ్యింది. సొంత భార్యే అతన్ని హత్య చేయించిందని తేలింది.
పాతబస్తీలో అక్రమంగా నిల్వ చేసి ఉంచిన బాణా సంచా సామగ్రిని సెంట్రల్ క్రైం స్టేషన్ పోలీసులు సీజ్ చేసారు. చెలపురాలోని ఓ గోదాములో బాణా సంచాను అక్రమంగా నిల్వ చేసివున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేసారు.
తీసుకున్న రుణాలను చెల్లించకుండా పలు బ్యాంకులను మోసం చేసిన ఏబీజీ షిప్ యార్డ్ మాజీ చైర్మన్ రిషి కమలేష్ అగర్వాల్ ను సీబీఐ అరెస్ట్ చేసింది
బాధ్యతగా మెలగాల్సిన వైద్యుడి బాధ్యతారాహిత్యం వల్ల నిండు ప్రాణం బలైంది. ఓ డాక్టర్ చేసిన నిర్లక్ష్యం వల్ల ఆ మహిళకు గర్భశోకం మిగిల్చింది. ప్రసవ వేదనతో ఆస్పత్రిలో చేరిన మహిళను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా.. పుట్టెడు శోకాన్ని మిగిల్చారు. వైద్యుడి వీడియో కాల్ సూచనల మేరకు నర్సులు ఆమెకు డెలివరీ చేశారు. ఈ ఘటన తమిళనాడులోని చెంగల్పుట్టు సునంబేడు గవర్నమెంట్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది.
మనిషి మృతదేహంపై కాసులు ఏరుకొనేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. మానవత్వాన్ని మరిచిపోయి మరీ రెచ్చిపోతున్నారు. జాలి, దయ, కరుణ చూపించాల్సిన ఆ సమయంలో రాబంధుల్లా పీల్చుకు తింటున్నారు