Last Updated:

Maruti FRONX: అదిరిపోయే ఫీచర్లతో మారుతీ నుంచి సరికొత్త ‘ఫ్రాంక్స్’.. ధరెంతో తెలుసా?

వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ తన సరికొత్త కాంపాక్ట్ స్పోర్ట్స్ వినియెగ వాహనం( SUV) ఫ్రాంక్స్ ను విడుదల చేసేందుకు రెడీ అయింది.

Maruti FRONX: అదిరిపోయే ఫీచర్లతో మారుతీ నుంచి సరికొత్త ‘ఫ్రాంక్స్’.. ధరెంతో తెలుసా?

Maruti FRONX: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ తన సరికొత్త కాంపాక్ట్ స్పోర్ట్స్ వినియెగ వాహనం( SUV) ఫ్రాంక్స్ ను విడుదల చేసేందుకు రెడీ అయింది. వచ్చే వారంలో దేశీయ మార్కెట్ లో ఫ్రాంక్స్ రానున్నట్టు తెలుస్తోంది. జనవరిలో జరిగిన ఆటో ఎక్స్ పో-2023 లో ఈ మోడల్ ను మారుతీ ప్రదర్శించింది. ఫ్రాంక్స్ మోడల్ ధర విషయానికి వస్తే రూ. 8 నుంచి 14 లక్షల (ఎక్స్ షోరూం) మధ్య ఉండనుందని సమాచారం. మారుత హ్యాచ్ బ్యాక్ బాలెనో ఆధారంగా ఫ్రాంక్స్ ను తీసుకొచ్చారు. పన్ను ప్రయోజనాల దృష్ట్యా ఈ ఎస్ యూవీ పొడవు 4 మీటర్ల కంటే తక్కువే ఉంటుందని తెలుస్తోంది.

 

ఫ్రాంక్స్ ఫీచర్స్ చూస్తే..(Maruti FRONX)

ఇక మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ప్రీమియం ఆడియో సిస్టమ్‌, 9 ఇంచుల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌, సన్‌రూఫ్‌ ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, వైర్‌లెస్‌ ఫోన్‌ ఛార్జింగ్‌, హెడ్స్‌ అప్‌ డిస్‌ప్లే, 360 డిగ్రీల పార్కింగ్‌ కెమెరా, రేర్‌ ఏసీ వెంట్స్‌, 6 ఎయిర్‌ బ్యాగ్‌లు, పుష్‌ బటన్‌ లాంటి తదితర ఫీచర్లుఉంటాయని తెలిసింది.

ఇక ఫ్రాంక్స్ ఎస్‌యూవీలో సిగ్మా, డెల్టా, డెల్టా+, ఆల్ఫా, జెటా పేరుతో 5 వేరియంట్లు ఉన్నాయి. 6 మోనోటోన్‌ కలర్స్ సెలక్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఆర్క్‌టిక్‌ వైట్‌, బ్లూ, ఓపులెంట్‌ రెడ్‌,ఎర్తర్న్‌ బ్రౌన్‌, స్ల్పెండిడ్‌ సిల్వర్‌, గ్రాన్‌డ్యూర్‌ గ్రే. ఇక డ్యూయల్‌ టోన్‌ ఆప్షన్లలోస్ల్పెండిడ్‌ సిల్వర్‌-బ్లూయిష్‌ బ్లాక్‌, ఓపులెంట్‌ రెడ్‌-బ్లూయిష్‌ బ్లాక్‌, ఎర్తర్న్‌ బ్రౌన్‌-బ్లూయిష్‌ బ్లాక్‌ లో లభించనుంది.

ప్రస్తుతానికి ఫ్రాంక్స్‌ లో రెండు రకాల ఇంజిన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒక రకం 1-లీటరు బూస్టర్‌జెట్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ కాగా.. కె-సిరీస్‌ పెట్రోల్‌ మోటార్‌ అసిస్టెడ్‌ స్మార్ట్‌ హైబ్రిడ్‌ టెక్నాలజీ రెండో రకం ఇంజిన్‌. రెనో కైగర్‌, కియా సోనెట్‌, మహీంద్రా ఎక్స్‌యూవీ 300 ,నిస్సాన్‌ మాగ్నైట్‌, హ్యుందాయ్‌ వెన్యూ, హోండా డబ్ల్యూఆర్‌-వీ, టాటా నెక్సాన్‌, వంటి ఇతర కంపెనీ మోడళ్లతో ఫ్రాంక్స్‌ పోటీ పడబోతోంది.