Home /Author Jyothi Gummadidala
విద్యాబుద్ధులు నేర్పే తల్లి జ్ఞాన సరస్వతి దేవి జన్మనక్షత్రం అయిన మూలా నక్షత్రం రోజు అమ్మవారికి ఎంతో వైభవంగా పూజలు నిర్వహిస్తారు అర్చకస్వాములు. చిన్నారులకు ఈ రోజు అక్షరాభ్యాసం చేయిస్తే ఉన్నత విద్యావంతులు అవుతారని ప్రజల నమ్మకం. అలాంటి రోజైన ఈ రోజున తెలుగురాష్ట్రాల్లోని ప్రసిద్ధ సరస్వతి దేవి క్షేత్రమైన బాసరలోని సరస్వతి దేవి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.
లెజండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందించినబడిన పొన్నియన్ సెల్వన్-1 మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్లతో దూసుకుపోతుంది. సౌత్ నార్త్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన పొన్నియన్ సెల్వన్ 30 సెప్టెంబర్ 2022న విడుదలై ఘన విజయం సాధించింది. మరి ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లను ఎంతో చూసేద్దామా..
రేపటి నుంచి అనగా 2 అక్టోబర్ 2022 నుంచి రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలకు దసరా సెలవులు ప్రకటిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 10న కళాశాలలు పున:ప్రారంభం కానున్నాయని వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. కాగా రాగల మూడురోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.
అల్లు స్టూడియోస్ ప్రారంభోత్సవాలు అట్టహాసంగా జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి ఈ స్టూడియోస్ ను ప్రారంభించారు. అల్లు వారి కుటుంబం మరియు మెగాస్టార్ కుటుంబ సభ్యులు ఈ వేడుకకు హాజరయ్యారు. దివంగత హాస్యనటుడు అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అల్లు రామలింగయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మెగాస్టార్.
నేటి తరం అబ్బాయిలకు ఒకసారే పెళ్లి కావకడమే కష్టం అంటే ఈ ప్రబుద్ధుడు మాత్రం ఏకంగా 24 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అదికూడా 28ఏళ్ల వయస్సులోనే అది ఎలా సాధ్యం అయ్యింది అని ఆశ్చర్యపోతున్నారు కదా అయితే ఈ కథనం చదివెయ్యండి.
శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న ఫుల్ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ మూవీ దసరా. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్చేశాయి. అయితే తాజాగా చిత్ర బృందం మరో క్రేజీ అప్డేట్ను ప్రేక్షకుల ముందుకు తెచ్చింది.
క్రికెట్ మ్యాచుల్లో గాయాలు కామన్. కాగా బ్యాటర్ల బాదుడు ధాటికి ఒక్కోసారి వికీలు, ఫీల్డర్లు, అంపైర్లు గాయపడుతుంటారు. కాగా ఇలాంటి సంఘటనే తాజాగా పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో చోటుచేసుకుంది. పాక్ బ్యాటర్ ఊపుడు దెబ్బకి లెగ్ అంపైర్ క్షతగాత్రుడు అయ్యాడు.
అల్లు స్టూడియోస్ ప్రారంభోత్సవ వేడుక వైభవంగా జరిగింది. దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అల్లు స్టూడియోస్ ను మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు.
దేశంలో నేటి నుంచి 5జీ సేవలు మొదలయ్యాయి. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు.