Home /Author anantharao b
ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని రైల్వే సేఫ్టీ కమిషనర్ ( సీఆర్ఎస్ ) నివేదిక తేల్చి చెప్పిందని తెలుస్తోంది. దీనితో ఈ ప్రమాదం వెనుకు ఎటువంటి కుట్ర లేదని స్పష్టమయింది.
ప్రధాని నరేంద్ర మోదీ నివాసంపై డ్రోన్ కలకలం రేపింది. నో ప్లయింగ్ జోన్లో డ్రోన్ చక్కర్లు కొట్టినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. దీనిపై ఢిల్లీ పోలీసులకు ఎస్పీజీ సమాచారం ఇచ్చింది. డ్రోన్ ఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బీఆర్ఎస్ అంటే బీజేపీ బంధువుల పార్టీ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేసారు. ఆదివారం సాయంత్రం ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన తెలంగాణ జనగర్జన సభలో ఆయన ప్రసంగిస్తూ బీఆర్ఎస్ ను బీజేపీ కి బి టీమ్ గా అభివర్ణించారు.
ఇండియాలో పలు యూనివర్శిటీలు 12 వ తరగతి పూర్తయ్యాక ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో హ్యుమానిటీస్, సైన్స్. ఇంజనీరింగ్, తదితర కోర్సులు ఉన్నాయి. ఐదేళ్లు చదివితే పీజీ పట్టా వస్తుంది. అయితే ఈ కోర్సులన్నీ మంచివేనా? దీనిపై ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ ఏమంటున్నారంటే కోర్సులు, కాలేజీలను బట్టి నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు
ప్రపంచంలోని అత్యంత పురాతన జాతీయ వార్తాపత్రిక, వీనర్ జైటుంగ్, ప్రారంభమైన దాదాపు 320 సంవత్సరాల తర్వాత దాని చివరి ఎడిషన్‌ను ముద్రించింది. ఇది వియన్నా కు చెందిన రోజువారీ వార్తాపత్రిక. ఇటీవలి చట్టాన్ని మార్చిన తర్వాత ఇకపై రోజువారీ ఎడిషన్లను ముద్రించకూడదని నిర్ణయించుకుంది.
దక్షిణ మెక్సికోలోని శాన్ పెడ్రో హువామెలులా పట్టణానికి మేయర్ గా ఉన్న విక్టర్ హ్యూగో సోసా అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతున్న సాంప్రదాయ వేడుకలో ఆడ మొసలిని వివాహం చేసుకున్నారు. మొసలిని యువరాణి గా స్దానిక కధలు ప్రస్తావిస్తాయి.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవార్ పలువురు ఎమ్మెల్యేల మద్దతుతో ఆదివారం మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేరారు. ఆయన ఈ పదవిని బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో పంచుకోనున్నారు
పారిస్‌కు దక్షిణాన ఉన్న పట్టణంలోని మేయర్ ఇంటిపైకి కారు దూసుకువెళ్లడంతో అతని భార్య మరియు పిల్లలలో ఒకరికి గాయపడ్డారు. మేయర్ విన్సెంట్ జీన్‌బ్రూన్ తన ఇంటిపై నిరసనకారులు దాడి చేశారని చెప్పారు. ట్విట్టర్ పోస్ట్‌లో, తనకు మరియు అతని కుటుంబానికి హాని కలిగించే ప్రయత్నంలో, నిరసనకారులు తన ఇంటిపై దాడి చేసారని తెలిపారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరపున దుబాయ్ లో తాను మూడు ఫ్లాట్స్ ను కొనుగోలు చేసినట్లు మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ తెలిపాడు. కేజ్రీవాల్ కు రాసిన ఒక లేఖలో అతను ఈ విషయాన్ని ప్రస్తావించాడు.
నేడు ఖమ్మం వేదికగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ జనగర్జన సభ జరగనుంది. ఈ సభకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హజరుకానున్నారు. జూపల్లి పొంగులేటితో పాటు పలువురు నాయకులు హస్తం గూటికి చేరటంతో పాటు. పార్టీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కూడా ఈ సభతో ముగియబోతుంది.