Home /Author anantharao b
అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలి పర్యటనలో పోలవరాన్ని సందర్శించిన ఆయన రెండో పర్యటనలో అమరావతిని పరిశీలించనున్నారు.
ఏపీ నూతన డీజీపీగా సీహెచ్ ద్వారకా తిరుమలరావును రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నియమించింది. ఆయన ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్నారు. పోలీసు దళాల అధిపతి (హెచ్ఓపిఎఫ్) మరియు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పూర్తి అదనపు బాధ్యత (ఎఫ్ఎసి)లో డిజిపి (హెచ్ఓపిజి)గా ఆయననునియమించారు.
కాపు ఉద్యమ నేత, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం పేరు మారింది. అధికారికంగా ఆయన పేరు ఇప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చారు. ముద్రగడ పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా గుర్తిస్తూ గెజిట్ విడుదల చేసింది
తమిళనాడు కళ్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం సేవించి 34 మంది చనిపోయారని కల్కురిచి జిల్లా కలెక్టర్ ఎంఎస్ ప్రశాంత్ గురువారం తెలిపారు. సుమారు 60 మంది ఆస్పత్రి పాలయ్యారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం మొత్తం 107 మందిని ఆస్పత్రిలో చేర్పించారు.
బ్రిటన్‌లో అత్యంత సంపన్నుల్లో అగ్రస్థానంలో నిలిచింది హిందూజా కుటుంబం. ఇండియాకు చెందిన వీరు బ్రిటన్‌లో స్థిరపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా వీరికి వ్యాపారాలున్నాయి. అయితే ఇటీవల హిందూజా గ్రూపుపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి.
శాండిల్‌వుడ్ చాలెంజింగ్ స్టార్ దర్శన్ తూగుదీప్ తన అభిమాని రేణుకా స్వామిని హత్య చేసిన విషయం తెలిసిందే. తాజాగా రేణుకా స్వామి పోస్ట్ మార్టం రిపోర్టులో ఒళ్లు జలదరించే అంశాలు వెలుగు చూశాయి
కరీంనగర్ బస్ స్టేషన్లో పుట్టిన చిన్నారికి జీవితాంతం బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు వీలుగా బస్‌పాస్‌ను అందజేస్తామని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) యాజమాన్యం ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్లలో జన్మించిన పిల్లలకు జీవితకాలం ఉచిత బస్‌పాస్‌ను అందించే గత విధానాన్ని కొనసాగిస్తూ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది.
మన దేశంలో ఆమ్ ఆద్మీ ప్రాణానికి విలువ లేదని మరోసారి రుజువైపోయింది. ఇటీవలే పూనేలో ఓ సంపన్నుడి సుపుత్రుడు పూటుగా మందుకొట్టి రూ. 2.5 కోట్లు విలువ చేసే పొర్శ్చేకారును విపరీతమైన స్పీడ్‌తో నడుపుతూ... కారు ముందు వెళ్తున్న వ్యక్తి మోటార్‌సైకిల్‌ను ఢీకొనడంతో బైక్ నడుపుతున్న వ్యక్తితో పాటు అతని స్నేహితురాలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయిన ప్రైమ్ 9 న్యూస్ సీఈవో వెంకటేశ్వరరావు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో బేటీ అయ్యారు. ఈ సందర్బంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహేల్ కారు యాక్సిడెంట్ కేసులో హైకోర్టు బెయిల్ మంజురుకు నిరాకరించింది. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ రోడ్డు ప్రమాదంలో షకీల్ కుమారుడిని తప్పించేందుకు ప్రయత్నించారు.