Manish Sisodia: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా లాకర్‌ను తనిఖీ చేసిన సీబీఐ
సీబీఐ ఘజియాబాద్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్‌లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా లాకర్‌ను తనిఖీ చేసింది. ఢిల్లీలో కొత్త ఎక్సైజ్ పాలసీ అమలులో అవినీతి జరిగిందని సీబీఐ ఆరోపించింది. ఈ నేపధ్యంలో తన బ్యాంక్ లాకర్‌పై సెంట్రల్ ఏజెన్సీ దాడులు చేస్తుందని సిసోడియా సోమవారమే పేర్కొన్నారు.
Delhi: సీబీఐ ఘజియాబాద్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్‌లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా లాకర్‌ను తనిఖీ చేసింది. ఢిల్లీలో కొత్త ఎక్సైజ్ పాలసీ అమలులో అవినీతి జరిగిందని సీబీఐ ఆరోపించింది. ఈ నేపధ్యంలో తన బ్యాంక్ లాకర్‌పై సెంట్రల్ ఏజెన్సీ దాడులు చేస్తుందని సిసోడియా సోమవారమే పేర్కొన్నారు.
రేపు సీబీఐ మా బ్యాంక్ లాకర్ పై దాడి చేయడానికి వస్తోంది. ఆగస్టు 19న నా ఇంటిపై 14 గంటలపాటు జరిపిన దాడిలో ఏమీ దొరకలేదు. లాకర్లో కూడా ఏమీ కనిపించదు. సీబీఐకి స్వాగతం. విచారణకు నేను, నా కుటుంబం పూర్తిగా సహకరిస్తాం అని సిసోడియా ట్వీట్ చేశారు. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో 15 మంది వ్యక్తుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత కూడా ఉన్నారు. ఈ కేసులో ఎక్సైజ్ అధికారులు, మద్యం కంపెనీల అధికారులు, డీలర్లతో పాటు కొందరు గుర్తుతెలియని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులపై కేసు నమోదు చేశారు.