Last Updated:

Hyundai Creta Electric launch: అయ్యగారే నంబర్ వన్.. బడ్జెట్ ఎలక్ట్రిక్ క్రెటా వచ్చేసిందిగా.. ఫ్యామిలీకి పర్ఫెక్ట్ మచ్చా..!

Hyundai Creta Electric launch: అయ్యగారే నంబర్ వన్.. బడ్జెట్ ఎలక్ట్రిక్ క్రెటా వచ్చేసిందిగా.. ఫ్యామిలీకి పర్ఫెక్ట్ మచ్చా..!

Hyundai Creta Electric launch: ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎలక్ట్రిక్ క్రెటాను విడుదల చేసింది. కంపెనీ ఎలక్ట్రిక్ క్రెటాను 4 విభిన్న వేరియంట్‌లలో విడుదల చేసింది, దీని ప్రారంభ ప్రారంభ ధర రూ.17,99,000. ఎలక్ట్రిక్ క్రెటా ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 473 కిమీల రేంజ్‌ను అందజేస్తుందని కంపెనీ తెలిపింది.

హ్యుందాయ్ ఎలక్ట్రిక్ క్రెటా అనేక టాప్ క్లాస్ లేటెస్ట్ ఫీచర్లతో ఉంటుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును ADAS 2 వంటి పూర్తిగా కొత్త,  అధునాతన భద్రతా ఫీచర్లతో విడుదల చేసింది. ఎలక్ట్రిక్ క్రెటాలో ADAS లెవల్ 2 ఫ్రంట్ కొలిషన్ వార్నింగ్, ఫ్రంట్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ కొలిజన్ అవాయిడెన్స్, లేన్ కీపింగ్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్, హై బీమ్ అసిస్ట్ వంటి 19 ఫీచర్లు ఉన్నాయి.

6 ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్‌తో కూడిన EBD, ADAS స్థాయి 2, ABS, EBD, హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు ESP వంటి ఫీచర్లను క్రెటా ఎలక్ట్రిక్‌లో చూడవచ్చు. ఇది కాకుండా, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, కీ-లెస్ ఎంట్రీ, వెనుక AC వెంట్స్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఈ SUVలో కనిపిస్తాయి.

కొత్త క్రెటా ఎలక్ట్రిక్ రెండు బ్యాటరీ ప్యాక్‌ల ఎంపికను కలిగి ఉంటుంది. ఇది 51.4kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది, ఇది ఒక్కసారి ఛార్జింగ్‌పై 472కిమీల రేంజ్ అందిస్తుంది. 42kWh బ్యాటరీ ప్యాక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 390కిమీల రేంజ్‌ను అందిస్తుంది. DC ఛార్జింగ్ సహాయంతో 10 నుంచి 80శాతం ఛార్జ్ చేయడానికి 58 నిమిషాలు పడుతుంది. అయితే AC హోమ్ ఛార్జింగ్ సహాయంతో 10 నుంచి 100శాతం ఛార్జ్ చేయడానికి 4 గంటలు పడుతుంది. ఈ కారు కేవలం 7.9 సెకన్లలో 0-100 కిమీ/గం వేగాన్ని అందుకోగలదు.

కొత్త క్రెటా ఎలక్ట్రిక్ దాని డిజైన్, స్థలం పరంగా కస్టమర్లకు ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా, ఇందులో అందించిన బ్యాటరీ కూడా నాణ్యతతో కూడి ఉంటుంది. ఇది కాకుండా మీరు ఇందులో చాలా ఫీచర్లను పొందుతారు. ఈ కారు కుటుంబ వర్గాన్ని ఆకర్షించగలదు. ఇందులో హై రైడ్ క్వాలిటీని కంపెనీ ఆఫర్ చేసింది. దీని హ్యాండ్లింగ్, బ్రేకింగ్ కూడా మెరుగ్గా ఉన్నాయి.

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ 4 వేరియంట్‌లలో విడుదల చేసింది – ఎగ్జిక్యూటివ్, స్మార్ట్, స్మార్ట్ (O), ప్రీమియం. ఎగ్జిక్యూటివ్ ధర రూ. 17,99,000, స్మార్ట్ రూ. 18,99,900, స్మార్ట్ (ఓ) రూ. 19,49,900, ప్రీమియం రూ. 19,99,900. ఇవన్నీ వేరియంట్‌ల ప్రారంభ ధర మాత్రమే. తర్వాత వాటి ధరలు పెరిగే అవకాశం ఉంది. భారతదేశంలో, ఇది మారుతి సుజుకి ఇ విటారా, టాటా కర్వ్ eV లతో పోటీపడుతుంది.

ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో’ 2025ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఈ ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యతనిస్తూ కొత్త వాహనాలు, విడిభాగాలు, సాంకేతికత విభాగాల్లో 100 కంటే ఎక్కువ కొత్త ఆఫర్‌లు ఉంటాయి. ఈసారి గ్రేటర్ నోయిడాలోని భారత్ మండపం, యశోభూమి, ఇండియా ఎక్స్‌పో సెంటర్, మార్ట్ అనే మూడు వేర్వేరు ప్రదేశాలలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.