New RBI Governor: ఆర్బీఐ గవర్నర్‌కు కొత్త బాస్.. సంజయ్ మల్హోత్రాను ప్రకటించిన కేంద్రం
Sanjay Malhotra appointed as new RBI Governor: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన గవర్నర్‌గా రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ పదవీ కాలం ఈ నెల 10న ముగియడంతో తదుపరి గవర్నర్‌ను కేంద్రం నియమించింది. 2018లో ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన శక్తికాంత దాస్ పదవీ కాలం 2021 సంవత్సరంలో ముగియగా, కేంద్రం మరో మూడేళ్లు పొడిగించింది. గడువు కూడా నేటితో ముగియనుండడంతో కొత్త గవర్నర్‌ను నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. మల్హోత్రా ఆర్బీఐకి 26వ గవర్నర్‌గా ఈ నెల 11న బాధ్యతలు చేపట్టనున్నారు.
రాజస్థాన్ కేడర్ ఐఏఎస్
మల్హోత్రా రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి. సంజయ్ కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో పట్టా పుచ్చకున్నారు. అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్శిటీ నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ పట్టా పొందారు.
మూడేళ్ల పాటు కొనసాగునున్న సంజయ్…
సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్‌గా మూడేళ్లపాటు కొనసాగనున్నారు. ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ పదవీ కాలం నేటితో ముగియనుంది. శక్తికాంత దాస్ గత శనివారమే ఆర్బీఐ పాలసీని ప్రకటించారు. అదే ఆయన చివరి సమీక్ష కావడం విశేషం. ఉర్జిత్ పటేల్ ఆకస్మిక నిష్క్రమణ తర్వాత డిసెంబర్ 12, 2018న శక్తికాంత దాస్ ఆర్బీఐ 25వ గవర్నర్‌గా నియమితులయ్యారు.
సుదీర్ఘ అనుభవం
సంజయ్ మల్హోత్రా 33 ఏళ్లపాటు పవర్, ఫైనాన్స్, టాక్సేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైనింగ్ మొదలైన విభిన్న రంగాల్లో పనిచేశారు. డిసెంబర్ 2022 నుంచి రెవెన్యూ కార్యదర్శిగా ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి (రెవెన్యూ)గా ఉన్న సంజయ్ ప్రత్యక్ష, ప్రత్యక్ష పన్నుల విధాన రూపకల్పనలోకీలక పాత్ర పోషించారు. అదే సమయంలో ఆర్థిక, బ్యాంకింగ్ రంగాలను పర్యవేక్షించారు. గతంలో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పోరేషన్ బాస్‌గా దానిని అభివృద్ధి బాట పట్టించారు. జీఎస్టీ ఫ్రేమ్‌వర్క్‌ను నిర్వహించే బాధ్యత కలిగిన జీఎస్టీ కౌన్సిల్ ఎక్స్-అఫీషియో కార్యదర్శిగా కూడా పనిచేశారు.